Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముందుగా నిటారుగా నిలబడాలి. ఇప్పుడు నెమ్మదిగా రెండు చేతులు శ్వాసని తీసుకుంటూ పైకి లేపాలి, ఇప్పుడు నెమ్మదిగా శ్వాసని వదులుతూ శరీరాన్ని సమతుల్యం చేసుకుంటూ కుడి కాలిని 90 కోణం వరకు లేపాలి. ఏదైనా వస్తువు పైన ఏకదాటిగా ఏకాగ్రతగా స్టేర్ చేసినట్లు అయితే శరీరం సమతుల్యం అవుతుంది. నెమ్మదిగా కుడికాలి కింద పెట్టి, ఇదే విధంగా ఎడమ కాలితో చేయాలి. కాలిని 90 కోణంలో నెమ్మదిగా శ్వాసని వదులుతూ రెండు చేతులు ముందుకు చాపుతూ తీసుకురావాలి. ఈ ఆసనంలో ఒక 20 సెకన్ల నుంచి ఒక నిమిషం వరకు ఉండవచ్చు.
ఉపయోగాలు : శరీరం మనస్సు సమతుల్యం పెరుగుతుంది
ఏకాగ్రత పెరుగుతుంది
శరీర ఆకృతి మెరుగవుతుంది
జాగ్రత్తలు : శరీరాన్ని జాగ్రత్తగా సమతుల్యం చేసుకుంటూ
ఈ ఆసనం చేయాలి.
- శ్రీచందన
డిజె ఫిట్నెస్ హబ్
9666665458