Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తడి టిష్యూలను వాడేవాళ్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వీటి వాడకంలో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి.
- టిష్యూల వల్ల ఎంత త్వరగా చర్మం మీద మురికీ, దుమ్ము ధూళీ దూరమవుతాయో అంత త్వరగా వ్యాపిస్తాయి. మార్కెట్లో రకరకాల టిష్యూలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో నాణ్యమైనవి ఎంచుకోవడం మంచిది. ఎటువంటి హానికారక రసాయనాలు కలపని వాటిని ఎంచుకుంటే ఇబ్బందులు ఎదురుకావు.
- ఒక టిష్యూ కాగితాన్ని ఒకసారే వాడాలి. కొందరు ఒకసారి ఉపయోగించాక పక్కన పెట్టుకుని, కాసేపయ్యాక మళ్లీ దాన్నే వాడతారు. అలా చేయడం వల్ల బ్యాగుల్లోని, వాటిని ఉంచిన ఉపరితలం మీద క్రిములూ, బ్యాక్టీరియా దాని మీదకు వచ్చి చేరతాయి. ఇలా చేస్తే చర్మసంబంధిత సమస్యలు వచ్చి చేరతాయి.
- ఎక్కడ పడితే అక్కడ వాడిన వెట్ వైప్స్ని వేయకూడదు. వాటిని సంచిలో ఉంచిమాత్రమే పడేయాలి. ఇలా చేస్తే కాస్తయినా బ్యాక్టీరియా వ్యాప్తిని అరికట్టిన వాళ్లమవుతాం. బాత్రూంలో ఫ్లష్ చేయడం సరికాదు.
- సున్నిత చర్మతత్వం ఉన్నవాళ్లని తడి టిష్యూలకి దూరంగా ఉండమంటారు నిపుణులు. నిజానికి మామూలు చర్మతత్వం కలిగినవారు కూడా అతిగాకాకుండా మితంగా వాడాలి. సహజసిద్ధంగా తయారైన సబ్బుల్ని ఎంపిక చేసుకొని ముఖాన్నీ, చేతుల్నీ కడుక్కోవాలి.