Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెక్కిళ్ళు ఒక రకమైన ఇబ్బందిని తెస్తాయి. కడు పులో ఉన్నదంతా ఒక పెద్ద అలలా ఎగిసి పడుతున్నట్లుగా కలిగే ఆ భావన అనుభవించే వారికి, చూసేవారికి కూడా ఇబ్బందికరమే. అతివేగంగా తినడం, తాగడం, మరీ చల్లని పదార్థాలు తీసుకోవడం, మరీ వేడిగా వున్నవి తీసుకోవడమే కాకుండా భావోద్రేకం, హఠాత్తుగా వచ్చిన వాతావరణ మార్పు వెక్కిళ్ళు రావటానికి కారణమవుతాయి.
- వెక్కిళ్ళు వస్తుంటే కొద్దిసేపు ఊపిరి బిగబట్టివుంచితే వాటంతటవే సర్దుకుంటాయి.
- రెండుమూడు స్పూన్లు పంచదార నోట్లోవేసు కుని నమిలినా సర్దుకుంటాయి.
- వేలుతో అంగిటి భాగాన్ని తాకి, కదిలించినట్టు చేసినా వెక్కిళ్ళు ఆగుతాయి.
- వెల్లకిలా పడుకుని మోకాళ్ళు రెండింటిని మడచి ఛాతి దాకా లాక్కుని నొక్కి పెట్టినా తగ్గుతాయి. ఇంకా వెక్కిళ్ళు ఆగకుండా వెంటవెంటనే వస్తుంటే వైద్యుని సంప్రదించాల్సిన అవసరం ఉంది.