Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముందుగా నిటారుగా నిలబడి రెండు కాళ్ళ మధ్య ఒక మీటరు దూరం ఉండేలా నిలబడాలి. ఇప్పుడు రెండు చేతులను భుజాలకు సమానంగా చాపాలి. నెమ్మదిగా కుడికాలు మోకాలి దగ్గర వంచి రెండు చేతులు నడుము వెనకాల నుంచి ఇంటర్ లాక్ చేసుకోవాలి. ఇదే విధంగా ఎడమ కాలు వైపు కూడా చేయాలి.
ఉపయోగాలు..
- శ్వాసక్రియ మెరుగవుతుంది.
- నడుము చుట్టూరా ఉన్న కొవ్వు కరుగుతుంది.
- చేతుల్లో బలం పెరుగుతుంది.
- శరీరాకృతి మెరుగవుతుంది.
- పొట్ట నరాలు బలపడి, కొవ్వు తగ్గుతుంది
జాగ్రత్తలు..
- మోకాళ్ల సర్జరీలు అయినవారు ఈ ఆసనం వేయరాదు.
- పొట్టకి సంబంధించిన సర్జరీలు అయిన వారు కూడా ఆ ఆసనం సాధన చేయవద్దు