Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లల చదువుల విషయంలో కొంతమంది తల్లిదండ్రులు అతిగా జోక్యం చేసుకుంటుంటారు. మరికొంత మంది అస్సలే పట్టించుకోరు. ఈ రెండు పద్ధతులూ మంచివి కావని చెబుతున్నారు నిపుణులు. విద్య విషయంలో పిల్లలని నిత్యం ప్రోత్సహిస్తూనే... వారి అభిరుచికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారు.
- పిల్లలు తమ అభిరుచికి తగిన చదువుల్లో ముందుకు సాగేలా పెద్దలు ప్రోత్సహించటంతో బాటు అందుకు తగిన వాతావరణాన్ని ఇంట్లో పెద్దలు ఉండేలా చూడాలి.
- చేతివేళ్ళ వలే ఏ ఇద్దరు పిల్లల గ్రహణ శక్తులూ ఒకేలా ఉండవనీ పెద్దలు గుర్తించాలి. కష్టమైన హౌంవర్కు లో తగినంత సాయం పెద్దలు చేయాల్సిందే. అయితే అన్నింటా జోక్యం చేసుకోరాదు. దీనివల్ల పిల్లలు పెద్దల మీద అతిగా ఆధారపడి వారు లేకుండా ఏ పనీ చేయలేకపోతారు.
- పిల్లల చదువుల విషయంలో వారి శక్తి సామర్థ్యాలను మించిన ఫలితాలను తల్లిదండ్రులు ఆశించక వాస్తవిక దష్టితో వ్యవహరించాలి. ఏదైనా సమస్య ఉన్నప్పుడు పిల్లల కోణం నుంచీ ఆలోచించే ప్రయత్నం చేయాలి.
- పిల్లలకు పాఠ్యాంశాలే కాక, లోక జ్ఞానాన్ని ఇచ్చే పుస్తకాలను చదివే అలవాటు చేయటం, కొత్త ప్రదేశాలకు తీసుకువెళ్లటం వల్ల వారి ఆలోచనా పరిధి పెరుగుతుంది.
- తల్లిదండ్రులు అప్పుడప్పుడు పాఠశాలకు వెళ్ళి, ఉపాధ్యాయులను కలిసి పిల్లల మీద వారి అభిప్రాయాలను తెలుసుకోవటం ద్వారా పిల్లల విషయంలో వీరికున్న అపోహలు తొలగిపోతాయి.
- పిల్లలు చదువులో ప్రతిభ చూపినప్పుడు పెద్దలు దాన్ని గుర్తించి ప్రోత్సహించాలి. అప్పుడే తమ శక్తి సామర్థ్యాలపై మరింత గురి కుదురుతుంది.
- చదువు విషయంలో పిల్లలను తోటి విద్యార్థులతో పోల్చి కించబరచరాదు. దీనికి బదులు సానుకూలమైన సలహాలివ్వటం, ప్రోత్సహించటం అవసరం.
- చదువుతోపాటు ఆటపాటలు ఉంటేనే వారు మంచి ఆరోగ్యాన్ని పొందగలరు గనుక పిల్లలు రోజూ కొంత సమయం ఆటలు, వ్యాయామం వంటివాటికి కేటాయించేలా చూడాలి.
- కంటిచూపు లోపాలు, బుద్ధి మాంద్యం వంటి జన్మతః వచ్చే కొన్ని సమస్యల కారణంగా పిల్లలు చదువులో వెనకబడొచ్చు. ఇలాంటి సమస్యలుంటే ముందుగానే గుర్తించి చికిత్స ఇప్పించాలి.
- పిల్లల లేత మనసులో వచ్చే సందేహాలను వారికి అర్థమయ్యే భాషలో వివరించి వారిని
- సంతప్తిపరచాలి తప్ప విసుక్కోరాదు. దీనివల్ల పిల్లల ఆలోచన, ఆసక్తి, జిజ్ఞాస సన్నగిల్లుతాయి.
- పిల్లలు ఒక సబ్జెక్టులో వెనుకబడటానికి కారణాలు అవగాహన చేసుకొని, ఇంట్లో బోధిస్తూ, ఆ సబ్జెక్టులో ఇష్టాన్ని పెంచుకునేలా, పెద్దలు శిక్షణని వ్వాలి. దీనివల్ల పిల్లలు ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా ఉంటారు.