Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెళ్లయ్యాక కొందరు ఇంటి బాధ్యతలకే పరిమితం అవుతుంటారు. దాంతో ఇంత చదువుకుని ఉద్యోగం లేకుండా ఇంట్లోనే ఉండిపోతున్నాం ఏంటనీ, ఉద్యోగాలు చేస్తున్న తోటివారితో పోల్చుకుని ఆత్మన్యూనతకు గురవుతారు. ఖాళీ సమయాన్ని సరైన దిశగా ఉపయోగించుకోలేక వృథా చేస్తుంటారు. ఈ రెండూ సరికాదు. ఇలాంటి పరిస్థితులకు దూరంగా మీ సమయాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ సాగిపోవాలంటే..
ఎక్కడికో వెళ్లి ఉద్యోగాలు చేస్తేనే చదువుకి సార్ధకత అన్న సంంగతి పక్కన ఉంచి... ఇంట్లోనే ఉండి చేసే ఉద్యోగాలు ఏమున్నాయో పరిశీలించండి.
కంప్యూటర్, నెట్ అందుబాటులో ఉంటే ఇంటి నుంచి పనిచేసే వీలున్న ప్రాజెక్టు పనుల్ని తీసుకోండి. సబ్జెక్ట్ మీద పట్టున్నట్లయితే ఆన్లైన్లో ట్యూషన్లు చెప్పవచ్చు. ఇంట్లోనే ఉండి చుట్టుపక్కల పిల్లలకు తరగతులు చెప్పడం ద్వారానూ మీ సమయాన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు.
ఇపుడు ఆన్లైన్ వ్యాపారాలు జోరుమీద ఉన్నాయి. ఇంట్లో మీరు తయారుచేసిన ఎక్కడి నుంచయినా తెప్పించిన వస్తువుల్ని ఆన్లైన్లో అమ్మి ఆదాయం పొందే ప్రయత్నం చేయవచ్చు.
పిల్లల్ని బడికి పంపిన తరువాత చాలాసమయం ఉంటుంది. ఆ సమయంలో మీ చిన్నారి పాత షూలకు లేసులూ, కుందన్లూ అంటించి డిజైనర్ తరహాలో తయారుచేయడం... పాత వాటినే కొత్తగా మార్చడం, పోషకాహారాన్ని కొత్తగా పిల్లలకు నచ్చేట్లు తయారుచేయడం వంటి వాటికోసం ఉపయోగిస్తే మంచిది కదా! అటువంటి ప్రయత్నం చేయండి.
అంతేగాక ఇంటిముందున్న కొద్దిపాటి స్థలంలోనే అందమైన, అవసరమైన మొక్కల పెంపకం కోసం కొద్ది సమయం కేటాయించండి.