Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముఖం మీద ఉన్న జిడ్డుదనాన్ని పోగొట్టడంలో ఐస్ బాగా పనిచేస్తుంది. ముఖానికి మేకప్ వేసుకునే ముందు చల్లటినీళ్లతో ముఖం కడుక్కోవాలి. లేదా ఐస్ ముక్కతో ముఖాన్ని రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం పైభాగంలో ఉండే సూక్ష్మమైన రంధ్రాలు మూసుకుపోతాయి. దీంతో చర్మంలోకి నూనె వెళ్లే అవకాశం ఉండదు. చర్మ రంధ్రాలు మూసుకుని పోవడం వల్ల చర్మం జిడ్డుగా తయారయ్యే అవకాశం ఉండదు.
క్రీమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ కాకుండా వాటర్‌ప్రూఫ్ ప్రొడక్ట్స్ వాడితే చర్మం జిడ్డుకారదు. ఎందుకంటే వాటర్‌ప్రూఫ్ ఉత్పత్తులు చర్మంలోకి ఇంకిపోవడం వల్ల జిడ్డుతనం ఉండదు. పఫ్తోనే ఫేస్ పౌడర్ని ముఖానికి వేసుకోవాలి.
చర్మం జిడ్డుగా ఉండకుండా ఎప్పుడూ మెరవాలంటే నీరు బాగా తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని కలుషిత పదార్థాలన్నీ బయటకుపోతాయి. అలాగే రోజూ ప్రొటీన్ ఫుడ్‌ని సమపాళ్లల్లో తినాలి. అంతేకాదు తేనె, ఆలివ్ నూనె, పసుపు, శాండల్వుడ్లను కలిపి పేస్టులా చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని కాసేపు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడిగేసుకుంటే చర్మం మెరుస్తుంది. ఎంతో మదువుగా కూడా తయారవుతుంది.
చర్మం జిడ్డుగా ఉండకుండా ఎప్పుడూ మెరవాలంటే నీరు బాగా తాగాలి. అలాగే రోజూ ప్రొటీన్ ఫుడ్‌ని సమపాళ్లల్లో తినాలి. అంతేకాదు తేనె, ఆలివ్ నూనె, పసుపు, శాండల్వుడ్లను కలిపి పేస్టులా చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని కాసేపు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడిగేసుకుంటే చర్మం మెరుస్తుంది. ఎంతో మదువుగా కూడా తయారవుతుంది.