Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముందుగా రెండు కాళ్ళు ముందుకు చాపి దండాసనంలో కూర్చోవాలి. తల, నడుము, కాళ్ళు నిటారుగా పెట్టాలి. ఇప్పుడు నెమ్మదిగా వజ్రాసనంలోకి రావాలి. శరీర బరువును రెండు కాళ్ళ మీద సమన్వయం చేసుకోవాలి. రెండు చేతులు నమస్కార ముద్రలో ఉంచాలి. నెమ్మదిగా శ్వాస వదులుతూ రెండు చేతులు ముందుకు సాగదీస్తూ ఉండాలి. ఈ ఆసనంలో శ్వాస క్రియ నార్మల్‌గా ఉండాలి. అర నిమిషం పాటు అలాగే ఉన్న తర్వాత తల, మెడ, నడుము నిటారుగా ఉంచి నెమ్మదిగా శ్వాస వదులుతూ వజ్రాసనంలోకి రావాలి. రెండు కాళ్ళు ముందుకు చాపి రిలాక్స్ కావాలి.
ఉపయోగాలు...
- శరీరంలో సమన్వయ తత్త్వం పెరుగుతుంది.
-హిప్ జాయింట్స్‌లో సాగే గుణం పెరుగుతుంది.
- అంతర్గత అవయవాలు ఉత్తేజితం అవుతాయి
- జీర్ణక్రియ మెరుగవుతుంది.
జాగ్రత్తలు..
- మోకాళ్లు, హిప్ జాయింట్ సర్జరీలు అయిన వారు ఈ ఆసనం చేయవద్దు
- మడమల నొప్పులు ఉన్నవారు జాగ్రత్తగా యోగా నిపుణుల పర్యవేక్షణలో సాధన చేయాలి.
- శ్రీచందన
డిజె ఫిట్నెస్ హబ్
9666665458