Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తేనె, ఆల్మండ్
చర్మం నిగారింపుకు తేనె, ఆల్మండ్ చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఇవి చర్మం మిల మిలా మెరిసేలా చేసి జీవం ఉట్టిపడేలా చేస్తాయి. ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ తీసుకుని, దానికి 1 టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1/2 టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ కలిపి చక్కగా పేస్ట్ లా చేసుకుని దానిని ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 15 నిమిషాల తరువాత కడిగేస్తే చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.
టొమోటో, ఓట్మీల్
టొమోటో చర్మ సౌందర్యాన్ని పెంచే ఏజెంట్ గా పని చేస్తుంది. టొమాటోలో ఉన్న సహజసిధ్ధ ప్రత్యేక లక్షణాలు చక్కటి చర్మాన్ని పొందేలా చేస్తాయి. ముందుగా 2 టేబుల్ స్పూన్స్ ఓట్‌మీల్‌ను తీసుకుని తర్వాత అందులో టొమాటో రసాన్ని వేసి దానిని బాగా కలపాలి. ఓట్మీల్ బాగా మెత్తగా గుజ్జుగా అయ్యేవరకు పేస్ట్ గా చేసుకోవాలి. తర్వాత దానిని ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 10 నిముషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
పాలు, నిమ్మ రసం
చర్మం నిగారింపును పెంచటంలో ఈ పద్ధతి ఎంతో ఉపయోగకరమైనది. ముందుగా 1 టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకుని దానికి 2 టేబుల్ స్పూన్స్ పాలు, 2-3 చుక్కలనిమ్మరసాన్ని వేసుకుని పేస్ట్‌గా చేసుకుని తర్వాత దానిని ముఖానికి పట్టించుకోవాలి. 15 నిముషాల తర్వాత ముఖాన్ని చక్కగా శుభ్రం చేసుకోవాలి. ఇలాగే కొన్ని వారాల పాటు చేస్తే మీరే ఫలితాల్ని చూడవచ్చు.
బంగాళాదుంప ముక్కలు
బంగాళా దుంప ముక్కలు స్లైసెస్‌గా కోసుకుని వాటిని ముఖానికి పెట్టుకుంటే ఎంతో ఫలితముంటుంది. ఎందుకంటే మీ చర్మంపై ఉన్న డార్క్ సర్కిల్స్ ని తీసివేస్తుంది. బంగాళా దుంపను స్లైసెస్ గా కట్ చేసుకుని ముఖానికి రాస్తూ ఉండాలి. దీనివల్ల చర్మం కాంతివంతమవుతుంది.
పెరుగు
ఇది సౌందర్యానికి చక్కటి ప్రోడక్టు. పాలతో తయారైన పదార్థ కాబట్టి ఏ సైడ్ఎఫెక్ట్ను చూపించదు. దీనిని ముఖానికి పెట్టుకుని కాసేపయ్యాక వాష్ చేసుకోవాలి. ఈ ప్యాక్‌తో చక్కటి నిగారింపు, మదుత్వం మీ ముఖంలో మీరే చూడవచ్చు. ఈ ప్యాక్‌ను రోజుకు రెండు సార్లు వేసుకుంటే ఎంతో మంచిది.