Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముందుగా రెండు కాళ్ళు ముందుకు చాపి దండాసనంలో కూర్చోవాలి. ఇప్పుడు నెమ్మదిగా సుఖాసనంలోకి మారాలి. రెండు చేతులు తొడల పైన పెట్టుకోవాలి. దీర్ఘంగా శ్వాస తీసుకొని అలాగే శ్వాసని ఆపాలి(అంతర్ కుంభక) రెండు అరచేతులు తొడలపై పెట్టి భుజాలని కొద్దిగా పైకి లేపి, నెమ్మదిగా మెడవంచి చుబుకాన్ని ఛాతికి ఆనించాలి. ఈ విధంగా చేస్తున్నప్పుడు వెన్నెముక నిట్టారుగా ఉంచాలి. అర నిమిషం తర్వాత నెమ్మదిగా శ్వాసని వదులుతూ యథాస్థితికి రావాలి.
ఉపయోగాలు..
- గొంతుకి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి.
- శ్వాసక్రియ మెరుగవుతుంది.
- థైరాయిడ్ పనితీరు మెరువగవుతుంది.
- ఏకాగ్రత పెరుగుతుంది.
- పాటలు పాడేవారికి ఈ ఆసనం చాలా ఉపయోగకరం.
జాగ్రత్తలు..
- అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు ఈ ఆసనం సాధన చేయవద్దు.
- శ్రీచందన
9666665458