Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతిరోజూ పిల్లలతో హౌంవర్క్ పూర్తి చేయించడం తల్లిదండ్రులకు ఓ సవాల్‌గానే ఉంటుంది. తల్లిదండ్రులు సాధారణంగా ఎదుర్కొనే సమస్య ఇది. దీన్ని అధిగమించాలంటే ఈ సూచనలు ఫాలో అయిపోండి.
ప్రతిరోజూ పిల్లలు స్కూల్ నుంచి రాగానే టీచర్లు ఏం చెప్పారు? చేయాల్సిన హౌంవర్క్ ఏంటి? అనే విషయాలను తప్పనిసరిగా అడిగి తెలుసుకోవాలి.
హౌంవర్క్ చేసే సమయంలో పిల్లలకు చాలా సందేహాలు వస్తుంటాయి. అటువంటప్పుడు దగ్గరుండి వారి సందేహాలను నివత్తి చేయాలి. దీంతో మరింత ఉత్సాహంగా హౌంవర్క్ పూర్తి చేస్తారు.
పిల్లలు నలుగురైదుగురు కలిసి ఒకేచోట కూర్చుని హౌంవర్క్ చేసుకొనేలా చేస్తే మరీ మంచిది. ఒకరిని చూసి ఒకరు హౌంవర్క్ కంప్లీట్ చేస్తారు.
ఈ సమయంలోగా హౌంవర్క్ కంప్లీట్ చేసుకోవాలని షెడ్యూల్ పెట్టాలి. దీనివల్ల పిల్లలకు షెడ్యూల్లో పనిపూర్తి చేసుకునే అలవాటు అబ్బుతుంది.
పిల్లలు హౌంవర్క్ చేసే సమయంలో పక్కన కూర్చుని ఫోన్ మాట్లాడటం చేయకూడదు. దానివల్ల వారి ఏకాగ్రత దెబ్బతింటుంది.
గణితానికి సంబంధించి హౌంవర్క్ చేసే సమయంలో పిల్లలకు బాగా సందేహాలు వస్తుంటాయి. అలాంటప్పుడు మీరు సందేహాన్ని నివత్తి చేస్తే సరి. లేదంటే ట్యూషన్ మాస్టారుతో లేదా క్లాస్ టీచర్‌తో మాట్లాడి సందేహాలు తొలగిపోయేలా చూడాలి.
ఉదయం త్వరగా లేచి హౌంవర్క్ పూర్తి చేస్తాను... ఇప్పుడు ఆడుకుంటాను అని పిల్లలు మారాం చేస్తుంటారు. కానీ పిల్లలు ఉదయం త్వరగా లేవరని గుర్తుపెట్టు కోవాలి. సాయంత్రం వేళలోనే హౌంవర్క్ పూర్తయ్యేలా చూడాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల హౌంవర్క్ విషయంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి.