Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇష్టపడి కొనుక్కున్న జీన్స్ రంగుమా రకుండా ఉండాలంటే, అరబక్కెట్ నీటిలో నాలుగు టేబుల్ స్పూన్ల వెనిగర్ వేయాలి. ఈ నీటిలో దుస్తుల్ని కొద్ది సేపు నానబెట్టి ఆ తర్వాత ఉతకాలి.
- ఊలు, సిల్కు బట్టలు గోరువెచ్చటి నీటిలో పిండిన తరువాత ఒక కాటన్ టవల్లో ఉంచి రోల్ చేస్తే టవల్ వాటి తడిని పీల్చు కుంటుంది. తర్వాత ఆరేయాలి.
- ఐరన్ బాక్స్ అడుగున కొద్దిగా పారాఫిన్ రాస్తే గంజిపెట్టిన బట్టలు అతుక్కోకుండా ఉంటాయి.
- ఒక టేబుల్ స్పూను నిమ్మ చెక్కల పొడిని వాషింగ్ పౌడర్ లో కలిపి బట్టలు ఉతికితే బట్టలు తెల్లగా ఉంటాయి.
- క్లాత్‌పై గమ్ అతుక్కుంటే కొద్ది సేపు ఐసుముక్కను క్లాత్‌పై ఉన్న గమ్‌పై ఉంచి ఆ తర్వాత గీరేస్తే గమ్ ఊడిపోతుంది.
- కొత్త బట్టలు, సిల్కు బట్టలు ఉతికేటప్పుడు ఆ నీటిలో కొంచెం ఉప్పు కలిపితే వాటి మదుత్వం, రంగు పోకుండా కాపాడుకోవచ్చు.
- గోడకు కొట్టిన మేకుకి బట్టలు తగిలించి తీసేటప్పుడు హడావిడిగా లాగితే చిరిగే ప్రమాదం ఉంది. ఆ మేకులో రబ్బరు కాని, స్పాంజ్ కాని గుచ్చి ఉంచితే బట్టలు చిరగవు.
- చేతి గుడ్డలకు, రిబ్బన్లకు పట్టిన మురికి పోవాలంటే ఉప్పు కలిపిన నీటిలో ఉతికితే చాలు.
- చేతితో ఎంబ్రాయిడరీ చేసేటప్పుడూ దారపు ఉండని చిన్నకప్పులో వేసి కుట్టుకుంటే దారం ఎక్కడికో వెళ్ళటం, వెతుక్కోవటం ఉండదు.
- జడల చమురు జాకెట్ల వెనుక అంటుతుంది. సోపుతో ఉతికితే గుడ్డ కాంతి పోతుంది. కనుక పత్తిలో కాని గుడ్డ ముక్కలో కాని పెట్రోలు అద్ది చమురున్న భాగాన రాస్తే కొత్త జాకెట్లా తయారవుతుంది.