Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎవరికైనా రొటీన్ లైఫ్‌తో బోర్ కొడుతుంది. పొద్దున్నే లేవటం అవే ఉరుకులు పరుగులు, అదే టైం టేబుల్. జీవితాన్ని మొదలు పెట్టినప్పుడు ఉండే ఉత్సాహం రానురాను కరువవుతుంది. అందులోనూ ఇంట్లోనే ఉండే హౌం మేకర్స్ ఇంకా ఇంకా బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పుడూ చేసిన పనే చేస్తూ, మళ్ళీ తెల్లారిందా అనుకుంటూ వాళ్ళు పడే పాట్లు అన్ని ఇన్ని కావు. అలాంటి లైఫ్‌లో కాస్త రంగులు నింపితే.....ఆనందాలు రెట్టింపయ్యి, అనురాగాలు విరబూస్తాయి, కదూ. మరి ఆ సంతోషాన్ని సొంతం చేసుకోవాలంటే ఏం చెయ్యాలి..?
- రొటీన్ లైఫ్‌కి కాస్త భిన్నంగా ఉండాలంటే వీకెండ్స్‌లో ఏదైనా లాంగ్ డ్రైవ్ గాని, లేదా చిన్న ట్రిప్ గాని ప్లాన్ చేసుకోవచ్చు. అలా తరచుగా వెళ్లివస్తే నిజంగానే జీవితం ఉల్లాసంగా... ఉత్సాహంగా ఉంటుంది.
- మనం రోజూ వాడే బట్టల్ని పక్కకి పెట్టి ఏదో ఒక న్యూ స్టైల్‌ని మార్చాలి. రోజూ సారీ వేసుకునే వాళ్ళు కాస్త డిఫెరెంట్‌గా జీన్స్, కుర్తీ లాంటివి ట్రై చేస్తే మీలో వచ్చే మార్పు మీరే గమనించచ్చు.
- ఇంట్లో ఉండే ఫర్నిచర్ ఎప్పుడు ఒకేలా ఉంటే మజానే రాదు. అందుకే ఇంటికి కొత్త కళ రావాలంటే వాటి ప్లేస్ లు మారుస్తూ ఉండాలి.
- మీ భాగస్వామి ఇంటికి వచ్చేసరికి ఒక స్వీట్ సర్ప్రైజ్ ప్లాన్ చేసుకోండి. ప్రతిరోజులా కాకుండా ఇంట్లోనే కేండేల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసుకుంటే రొటీన్ కి భిన్నంగా ఉంటుంది.
- మీకు సన్నిహితమైన వాళ్ళని ఇంటికి భోజనానికి పిలవండి. వాళ్ళు వచ్చారు వెళ్లారు అనేలా కాకుండా కాస్త వెరైటీగా కార్డ్స్ గేమ్ లాంటి ఫన్నీ గేమ్స్ గాని ప్లాన్ చేసుకుంటే మనసుకి హాయిగా ఉంటుంది.
- మాములుగా ఇంట్లో అందరు ఉన్నప్పుడు మీకు ఇష్టమైన సినిమా వస్తున్నా అది చూసే అవకాశం ఉండదు. పిల్లలు కార్టూన్ చూస్తామని, మిగిలిన వాళ్ళు సీరియల్స్ చూస్తామని రిమోట్ మీ చేతికి అందనీయరు. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు హాయిగా మీకిష్టమైన సినిమాని ప్లే చేసి చూడండి.
- మీకిష్టమైన కలర్ డ్రెస్, అది మీ పార్టనర్‌కి నచ్చకపోతే మీరు వేసుకోటానికి సాహసించరు. అందుకే ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు లేదా మీ ఫ్రెండ్స్‌తో బైటకి వెళ్ళినప్పుడు ఆ కలర్ డ్రెస్ వేసుకుని మీ కోరికని తీర్చుకోవచ్చు.
- ఇంట్లో మీకు బాగా ఇష్టమైన పెంపుడు జంతువుని పెంచుకుంటే బోర్ అనే మాటే ఉండదు. ఖాళీగా ఉన్న సమయంలో వాటితో ఆడుకుంటూ ఉంటే టైం ఇట్టే గడిచిపోతుంది.
- మీకిష్టమైన వాళ్ళ స్పెషల్ డేస్ గుర్తుపెట్టుకుని వాళ్ళకి గ్రీటింగ్ గాని, ఫ్లవర్ బొకే గాని పంపితే వాళ్ళు తిరిగి మీకు రెస్పాండ్ అయ్యే విధానంతో మీలో ఉత్సాహం మరింత రెట్టింపవుతుంది.