Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళలు తాము ధరించే దుస్తులకు అనుగుణంగానే కాదు శరీరం ఆకారాన్ని కూడా పరిగణలోకి తీసుకుని బ్రా ఎంపిక చేసుకోవాలి. మెడ వరకు జాకెట్ వేసుకునే వారు చుడీదార్లు, మిడ్డీలు ధరించేప్పుడు ఫుల్ కప్ బ్రాలనే వాడాలి. పిల్లలకు పాలు పట్టేవారు అందుకు డబుల్ కప్ బ్రాని ఎంపిక చేసుకుంటే సౌలభ్యంగా ఉంటుంది. రాత్రుళ్లు నైట్ డ్రస్‌లు, నైటీలు వేసుకునే అలవాటు ఉన్న వారు ఈజీ బ్రాని, వ్యాయామం చేసే వారు కాటన్ బ్రా వాడటం మంచిది.
- మీరు మీకు తగ్గ బ్రాలని కొనుగోలు చేయటంలో ఎంత శ్రద్ద చూపిస్తారో.. స్ట్రాప్ విషయంలోనూ అంతే శ్రద్ద చూపించాలి. వెడల్పు తక్కువగా ఉండే స్ట్రాప్‌ల కంటే ఎక్కువగా ఉండేవి ఎంచుకుంటే మంచిది. ఏదో ఒక క్లాత్ అని కాకుండా వీలైనంత వరకు బనియన్క్లాత్తో తయారు చేసిన బ్రాలనివాడితే ఒంటికి హత్తుకుని హాయిని కలిగి స్తాయి. అలాగే కాటన్ బ్రాలు కూడా.
- డెలివరీ అయిన మహిళలు నర్సింగ్ బ్రాని వేసుకుంటే.. ఇది బిడ్డకి పాలిచ్చేందుకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే ప్రస్తుతం మార్కెట్లో డ్రాప్ కప్ బ్రాలు, జిప్పు బ్రాలు సైతం డెలివరీ మహిళల కోసం దొరుకుతున్నాయి. ఇవి సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా పబ్లిక్ స్ధలాల్లో కూడా పిల్లలకు పాలు ఇచ్చేందుకు ఇబ్బంది లేకుండా ఉంటాయి.
- బ్రా అన్నది కేవలం అందం కోసమే కాదు ఆరోగ్యాన్ని కూడా కాపాడేది అన్నది చాలా తక్కువమందికి తెలుసు. అయితే ఏదో ఓ బ్రా కొనేసుకున్నాం... వేసేసుకున్నాం అన్న తీరులో పోతే, వెన్ను నొప్పి, తలనొ ప్పి, మెడనొప్పితో పాటు రొమ్ము క్యాన్సర్ వచ్చే ఆస్కారం కూడా ఉందన్నది వైద్య నిపుణుల హెచ్చరిక. రోజులో 24 గంటలు బ్రా ధరించే వారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవ కాశాలు ఎక్కువగా ఉన్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- చాలామంది మహిళల్లో బ్రా ధరిస్తే వెన్ను నొప్పి వస్తోందన్న భావనఉంది. ఇది వాస్తవం కూడా అయితే ఇందుకు బ్రాఎంపిక సరి లేక పోవటమే ప్రధాన కారణం.టీనేజ్ అమ్మాయిలు మొదలు 30 ఏళ్ల యువతులు వరకు తమ టీనేజ్‌లో అమ్మాయిలు సాధారణంగా చేసే పొరపాటు ఏమిటంటే ఏదైనా డ్రెస్సుతో బ్రా ధరించేస్తారు. దీంతో ఏం తేడా కనిపిస్తుందని అనుకుంటున్నారు. కానీ ఎలాంటి డ్రెస్సుతో ఎలాంటి బ్రా ధరించాలనేది మీరు తప్పక తెలుసుకోవాలి. ఉదాహరణకు మీరు మంచి ఖరీదైన డ్రెస్సు ధరించి, దాంతో ప్యాడెడ్ బ్రాకు బదులు పాత సాధారణ బ్రా ధరించారనుకోండి. మీ లుక్ ఆకర్షణీయంగా ఉండదు.
ఏ డ్రెస్‌కి ఏది బాగుంటుంది..
టీషర్ట్బ్రా: టీషర్ట్ బ్రాలో షేప్ ఇచ్చేందుకు లైట్‌గా ప్యాడ్ అమర్చి ఉంటుంది. ఇది సౌకర్యవంతంగా ఉంచటంతో పాటు క్లీన్లుక్ ఇస్తుంది. ముఖ్యంగా మీరు ఫిటింగ్ చేసి పల్చగా ఉన్న డ్రెస్సు ధరించినప్పుడు ఇది బాగుంటుంది.
స్ట్రాప్ లెస్ బ్రా: పేరులో చెప్పినట్లే దీనికి స్ట్రాప్స్ ఉండవు. మీరు స్ట్రాప్స్లెస్ డ్రెస్సు, ట్యాంక్ టాప్, హోల్డర్నెక్ ధరిస్తున్నట్లయితే ఈ బ్రాను ఎంచుకోండి. స్ట్రాప్‌లెస్ బ్రా కొనేటప్పుడు దాని సైడ్స్, వెనుక ఉన్న పట్టీ వెడల్పుగా ఉండాలి.
పుషప్ బ్రా: టీనేజిలో అమ్మాయిలు తమకు పుషప్ బ్రా అవసరమేంటి అనుకుంటారు. కానీ ఈ బ్రా తప్పక తీసుకోవాలి. ఇది అనేక డిజైన్స్, కలర్, ప్రింట్, లేస్వర్క్లో వస్తుంది.
రిమూవబుల్ ప్యాడింగ్ బ్రా- ఈ బ్రాలో ఒక ప్యాకెట్ ఉంటుంది. అందులో అవపరమైనప్పుడు ప్యాడ్ వేసుకోవచ్చు. ప్రతిరోజూ ప్యాడెడ్ బ్రా ధరించడం ఇష్టం లేని వారు కేవలం ప్రత్యేక సందర్భాల్లో ధరించాలనుకుంటే ఇది తీసుకోవచ్చు.
సిలికాన్ ప్యాడింగ్: స్కిన్‌పై పెట్టుకోవచ్చు. ఇది స్కిన్లాగే మెత్తగా ఉంటుంది. దీన్ని ధరిస్తే ఒంటిపై ఇది ఉన్నట్లు కూడా అనిపించదు. దీన్ని మీరు బ్యాక్‌లెస్ డ్రెస్, సెంటర్ కట్‌తో డ్రెస్‌తో క్యారీ చేయొచ్చు.