Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెల్లని దుస్తులపై పడ్డ మరకలను పోగొట్టాలంటే చాలా ఇబ్బందులు పడాలి. ముఖ్యంగా ఇంట్లో స్కూల్ కు వెళ్లే పిల్లలున్నప్పుడు.. వారి యూనిఫామ్ వైట్ డ్రెస్ ఐతే ప్రతివారం ఆ డ్రస్సులను ఉతకడానికి తల్లులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. పెద్దవారితో పోల్చితే చిన్నపిల్లల దుస్తులపై మరకలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకని ఈ చిన్నచిన్న చిట్కాలు పాటించి చూడండి.
పొటాటో: తెల్లనిదుస్తులపై పడినటువంటి మరకలను తొలగించడానికి పొటాటో నుండి తీసిన రసం బాగా ఉపయోగపడుతుంది. పొటాటో నుండి రసం తీసి మరకలపై ఉంచి రబ్ చేసుకోవాలి. ఆ తర్వాత మాములుగా సర్ఫ్‌లో కొన్ని నిముషాల పాటు నానబెట్టుకుని ఉతికేయడం వల్ల మరకలు త్వరగా తొలగిపోతాయి.
వెనిగర్: మరకలను తొలగించడానికి వెనిగర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కొంచెం వెనిగర్ తీసుకుని తెల్లని దుస్తులపై ఉన్న మరకలపై రుద్దాలి. మళ్ళీ కొద్దిసేపు నీటిలో ఈ తెల్లని దుస్తులను ఉంచి వాష్ చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే మరకలు తొలగిపోయి దుస్తులు మిలమిల మెరిసిపోతాయి.
బేకింగ్ సోడా: తెల్లని దుస్తులపై పడినటువంటి మరకలను తొలగించడానికి మరో బెస్ట్ రెమెడీ బేకింగ్ సోడా . తెల్లని దుస్తులను నీటిలో నానబెట్టేటప్పుడు అందులో కాస్త బేకింగ్ సోడా వేసుకుని శుభ్రం చేసుకోవడం వలన వైట్ డ్రెస్‌లపై పడినటువంటి మరకలను శుభ్రంగా దూరం చేసుకోవచ్చు.
నిమ్మరసం: వైట్ డ్రెస్‌లపై ఉన్న మరకలను దూరం చేయడానికి ఇబ్బందులు పడుతున్న మీరు ఒక్కసారి ఇలా చేస్తే చాలు. కొద్దిగా నిమ్మరసం తీసుకుని మరకలపై చల్లి బాగా రుద్దాలి. ఆతర్వాత చల్లని నీటితో మాములుగా ఉతకడం వలన మిలమిల మెరిసిపోతాయి.
అలాగే ఇలా వైట్ డ్రెస్ వేసుకున్నప్పుడు పర్ఫ్యూమ్స్, బాడీ స్ప్రేలు వంటివి వాడకుంటే మంచిది. ఎందుకంటే ఇవి తెల్లని దుస్తులపై పడటం వలన త్వరగా మరకలు ఏర్పడుతాయి. కొంతమందిలో ఎక్కువగా చమటలు వస్తుండటం వలన చంకల నుండి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది కూడా. అందుకని ఇలా జరగకుండా ఉండటానికి ఆర్మ్ ప్యాడ్లు వాడటం బెటర్.