Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొడిబారిన, చిట్లినట్లు మారిన కనుబొమ్మ వెంట్రుకలకు రోజూ 2 సార్లు వ్యాజ్ లైన్ రాస్తే కనుబొమ్మలు తగినంత తేమను, మెరుపును సంతరించుకొంటాయి.
- కనుబొమ్మల వెంట్రుకలు పల్చగా, బలహీనంగా ఉన్నవారు రోజూ నాలుగైదు చుక్కల ఆముదాన్ని కనుబొమ్మల మీద రాసి తేలికగా మర్దనా చేస్తే కుద్దుళ్ళు బలపడి ఒత్తుగా పెరుగుతాయి.
- కనుబొమ్మలు వేగంగా, పొడవుగా పెరగాలంటే రోజూ నాలుగు చుక్కల ఆలివ్ నూనె లేక కొబ్బరి నూనె రాస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
- పలు కారణాల వల్ల కనుబొమ్మల ఎదుగుదల ఆగిపోయిన వారు రోజూ ఉల్లిగడ్డ రసం రాస్తే అందులోని భాస్వరం కనుబొమ్మల కుదుళ్ళ వద్ద రక్త ప్రసరణను పెంచి పెరుగుదలకు ఊతమిస్తుంది.
- కనుబొమ్మలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం ఆరు లీటర్ల నీరు తాగాలి.
- కనుబొమ్మలపై రోజూ తాజా కలబంద గుజ్జు రాయటం వల్ల ఎదుగుదల మెరుగుపడుతుంది.
- కనుబొమ్మల మీద నిమ్మ తొక్కతో రుద్దితే అక్కడి మలినాలు తొలగిపోయి ఆరోగ్యంగా కనిపిస్తాయి.
- గుడ్డు పచ్చసొనను కనుబొమ్మలకు రాసి పావుగంట తర్వాత చల్లటి నీటితో కడిగితే కనుబొమ్మ వెంట్రుకల మూలాలు చక్కగా పెరుగుతాయి.