Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోళ్ల రంగుని తొలగించడానికి నెయిల్ పాలిష్ రిమూవర్‌ని వాడుతుంటారు. అయితే వాడిన ప్రతిసారీ ఈ రిమూవర్‌ని వాడటం వల్ల .. అందులోని రసాయనాల వల్ల గోళ్లకు హాని జరిగే అవకాశం ఉంది. అందుకే నెయిల్ పాలిష్ తీసేయడానికి ఈ పద్ధతులను అనుసరించండి.
- ఒక చిన్న గిన్నెలో వేడి నీటిని తీసుకొని వేళ్లను అందులో పావుగంటపాటు ఉంచాలి. తరువాత పొడి తువ్వాలుతో నెయిల్ పాలిష్ పైన గట్టిగా రుద్దాలి. ఇలా చేస్తే పాలిష్ పెచ్చులు పెచ్చులుగా ఊడివస్తుంది.
- డియోడరెంట్, బాడీస్ప్రే, పర్ఫ్యూమ్, హెయిర్ స్ప్రేల్లో దేనితోనైనా కొంచెం దూదిని తడి చేసి గోళ్ల రంగును తుడవాలి. ఈ పద్ధతి ద్వారా కొన్ని సెకన్లలో నెయిల్‌పాలిష్‌ని శుభ్రం చేయవచ్చు.
- కొద్దిగా దూదిని తీసికొని వెనిగర్‌లో ముంచి గోళ్ల రంగుపై రుద్దాలి. అలాగే వెనిగర్‌కి కొంచెం నిమ్మరసం లేదా బత్తాయి రసం కలపాలి. ఈ మిశ్రమంలో గోళ్ల రంగున్న వేళ్లను పది నిమిషాలపాటు ఉంచాలి. దీని ద్వారా చాలా సులభంగా నెయిల్ పాలిష్ పోతుంది.
- నెయిల్ పాలిష్‌పై టూత్‌పేస్టు రాసి వెంటనే దూదితో తుడిచేయాలి. అప్పుడు పేస్టుతోపాటు గోళ్లరంగు తొలగిపోతుంది. అయితే పేస్టు ఎండిపోతే మాత్రం అంతగా పనిచేయదు.
- నెయిల్ పాలిష్‌పై కొత్త నెయిల్ పాలిష్‌తో మరొక కోటింగ్ వేయడం, ఆల్కహాల్లో దూదిని ముంచి తుడవడం ద్వారా కూడా నెయిల్‌పాలిష్‌ని తొలగించవచ్చు.