Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిమ్మ, కీరదోసకాయ రసాల్లో తేనె, పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే బుగ్గలు గులాబీ రంగుకి మారిపోవడం ఖాయం.
- యాపిల్ సైడర్ వెనిగర్‌తో గులాబీ బుగ్గలు సొంతమ వుతాయి. అదెలాగంటే యాపిల్ సైడర్ వెనిగర్‌లో దూదిని ముంచి బుగ్గల మీద నెమ్మదిగా తడుతున్నట్టు రాసుకుని ఆరనివ్వాలి.
- బీట్రూట్ రసంలో కొంచెం చక్కెర కలిపి ముఖానికి రాసు కోవాలి. పావుగంట తరువాత నీళ్లతో కడిగేయాలి.
- బీట్రూట్కి బదులు ద్రాక్షరసం, దానిమ్మగింజల రసం లేదా నేరేడు పండు రసాన్ని అయినా రాసుకోవచ్చు.
-9 బాదం గింజల పొడిలో గులాబీ పూరేకల గుజ్జు, తేనెలను కలపాలి. ఈ ప్యాక్‌ను ఫ్రిజ్‌లో వారం రోజుల పాటు నిల్వ చేయొచ్చు. గులాబీ పూరేకుల వల్ల బుగ్గలకు మంచి రంగు వస్తుంది. ఈ ప్యాక్‌ను రోజూ వేసుకుంటే వారం రోజుల్లో మీ బుగ్గలు రంగు తేలడం ఖాయం.
- ఎండబెట్టిన గులాబీ పూరేకుల పేస్ట్‌ను ముఖానికి రాసుకున్నా ఫలితం ఉంటుంది.
- అరటిపండు గుజ్జులో పాలమీగడ కలిపి ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాల తరువాత చల్లటి నీళ్లతో కడిగేయాలి.
- కీరదోస, టొమాటో గుజ్జుతో కూడా బుగ్గలకు సహజసిద్ధమైన మెరుపు వస్తుంది.