Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైహీల్స్' అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు. నలుగురిలో ప్రత్యేకంగా, స్టయిల్‌గా కనిపించడం కోసం ఎత్తు మడమల చెప్పులు వాడొచ్చు. అయితే వాటి వాడకం మితంగా ఉండాలి. లేదంటే రకరకాల ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్టే!
- దుస్తులకు తగ్గట్టు రకరకాల ఎత్తు చెప్పులను యువతులు ఎంచుకుంటూ ఉంటారు. అయితే వాటిని వేసుకుని కొద్ది దూరం నడిస్తే చాలు కాలి వేళ్లు, పాదాలు, పిక్కల నొప్పులు మొదలు పెడతాయి. దాంతో ఎత్తు మడమల చెప్పులతో కాళ్లు మాత్రమే నొప్పులు పెడతాయి అనుకుంటాం! కానీ నిజానికి హై హీల్స్ వాడకం వల్ల పూర్తి శరీరాకతి, ఎముకలు, కండరాలు, పునరుత్పత్తి వ్యవస్థ, నెలసరి ఇలా బాహ్య, అంతర్గత అవయవాలన్నీ ఎంతో కొంత దెబ్బ తింటాయి.
- యుక్త వయసులోకి అడుగుపెట్టిన అమ్మాయిల శరీరాల్లో హార్మోన్ల ప్రభావం వల్ల మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ వయసులో ఎత్తు మడమల చెప్పులు వేసుకోవడం వల్ల పొత్తికడుపు, నడుము, పాదాల్లో నరాల పనితీరు దెబ్బ తింటుంది. ఆకారం, తద్వారా నడక దెబ్బ తింటుంది. గర్భసంచి స్థానభ్రంశం చెంది కిందకి జారే ప్రమాదమూ ఉంటుంది. దాంతో భవిష్యత్తులో సంతానోత్పత్తి సమస్యలూ తలెత్తవచ్చు. హై హీల్స్ వేసుకోవడం వల్ల నడుము పైభాగం ముందుకు వంగి వెన్ను సమస్యలూ రావొచ్చు.
ఏ చెప్పులు మేలు?
- చదునుగా ఉండే చెప్పులు వేసుకుంటే పాదాలు నేల మీద సమాంతరంగా ఆని, శరీర బరువు రెండు పాదాల మీద సమానంగా పడుతుంది. దాంతో నడుమూ, వెన్నూ నిటారుగా ఉంటాయి. శరీరాకతీ చక్కగా ఉంటుంది. అదే ఎత్తు మడమల చెప్పులు వాడితే, నడుము ముందుకి వంగిపోతుంది. దాంతో శరీరాకతీ దెబ్బ తింటుంది. అండాశయ సమస్యలూ తలెత్తుతాయి. ఎండోమెట్రియాసిస్ కూడా రావొచ్చు.
- ఎత్తు మడమల చెప్పులు వాడితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హై హీల్స్‌ను 20 నిమిషాలకు మించి వేసుకోకూడదు. గర్భిణులు హై హీల్స్ వాడకూడదు. 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు హై హీల్స్‌కు దూరంగా ఉండాలి. ఎత్తు మడమల చెప్పులు వాడేవాళ్లు కూర్చున్న ప్రతిసారీ పాదాలను మడుస్తూ, చాపుతూ వ్యాయామం చేయాలి. పెన్సిల్ హీల్‌కు బదులుగా వెడ్జెస్ వేసుకుంటే ప్రభావం తక్కువగా ఉంటుంది. ఎత్తు మడమల చెప్పులు వాడినా, తరచుగా చదునుగా ఉండే చెప్పులూ వాడుతూ ఉండాలి. హై హీల్స్ వేసుకుని గట్టి నేలల మీద ఎక్కువ సమయంపాటు నడవడం మానేయాలి.