Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుండెకు మంచిది : ఉల్లికాడలు గుండె, రక్తనాళాలకు మంచిది. ఇది కొలెస్ట్రాల్ ఆక్సీకరణను తగ్గిస్తుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
బ్లడ్ ప్రెజర్ ని మెరుగుపరుస్తుంది : ఈ కూరగాయలోని సల్ఫర్ కాంపౌండ్ బ్లడ్ ప్రెజర్ స్థాయిలను నియంత్రించడానికి, తగ్గించడానికి సహాయపడుతుంది.
కొలెస్ట్రాల్ స్థాయిలు : ఉల్లికాడలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి.
మధుమేహం : ఉల్లికాడలలో ఉన్న క్రోమియం కంటెంట్ మధుమేహ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది, గ్లూకోస్ శక్తిని పెంచుతుంది.
జలుబు, జ్వరం : దీనిలో ఉన్న యాంటీ-బాక్టీరియల్ లక్షణం జలుబు, జ్వరానికి వ్యతిరేకంగా పోరాడడానికి సహాయ పడుతుంది.
అరుగుదల పెరుగుతుంది : అసౌకర్య అరుగుదల నుండి ఉపశమనానికి యాంటి బాక్టీరియల్ లక్షణాలను కూడా అందిస్తుంది.
వ్యాధినిరోధక శక్తి : ఈ కూరగాయలోని విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.
జీవక్రియ : స్ధూలపోషకాలు ఉండడం వల్ల ఇది జీవక్రియ నియంత్రణకు మంచి ఆహారం.
కళ్ళు : ఉల్లికాడలు కళ్ళ జబ్బులకు, కాళ్ళ సమస్యలకు మంచివి.ముడతలను తొలగిస్తుంది: ఇవి చర్మానికి మంచిది, ఇది చర్మం ముడతలు పడకుండా రక్షిస్తుంది.