Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంట్లో కూల్‌డ్రింక్ సీసాలు లేదా వాటర్ బాటిల్స్.. పాత ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటే తొందరపడి చెత్తలో పడేయకండి. వాటిని వెరైటీగా వాడుకోవచ్చు. గాజుసీసాలు ట్రాన్స్పరెంట్గా ఉంటాయనుకుంటే వాటర్ కలర్స్‌తో బాటిల్స్‌కి రకరకాల రంగులు వేయొచ్చు. అన్ని బాటిల్స్ ఒకే సైజు ఉండాల్సిన అవసరం లేదు. రక రకాల సైజులున్న బాటిల్స్‌ని కూడా ఎంచుకోవచ్చు.
- ఈ గాజు బాటిల్స్‌పై అలంకరణకోసం రంగులు, డిజైన్ స్టిక్కర్లు అతికించుకోవచ్చు. వీటిని ఇంట్లోని బల్లలపై లేదా గోడల మీద అమర్చవచ్చు. ఈ గాజు సీసాల్లో అలంకరణకి వాడే స్మాల్ లైట్స్ ఉంచి రాత్రి పూట వెలిగిస్తే హాల్ సరికొత్త అందాలతో మెరిసిపోతుంది. అలా బాటిల్స్ డెకరేటివ్ లైట్స్‌గా అలరిస్తాయి.
- ఈ సీసాల్లో ఇండోర్ ప్లాంట్స్‌ని పెంచుకోవచ్చు. అంతేకాదు రకరకాల పూలని సీసాలో సెట్ చేసి ఇంట్లోని టేబుల్స్ మధ్యలో పెట్టుకోవచ్చు. రెస్టారెంట్స్‌లో కాయగూరలు, పండ్లని అలంకరించినట్లు ఇంట్లో కూడా అలం కరించుకోవచ్చు. ఎలా అంటే మూతి భాగం వెడల్పుగా ఉండే గాజు బాటిల్‌ని తీసుకుని అందులో ఇష్టమైన వెజిటెబుల్ ఉంచి, దానికి వెనిగర్ వేసి బిరడా మూసేయాలి. దీన్ని వంటగదిలో అలంకరణగా పెట్టుకోవచ్చు.
- ఇక ప్లాస్టిక్ బాటిల్స్‌లో మట్టిపోసి ఇంట్లో పెరిగే మొక్కలనీ పెంచుకోవచ్చు. వాటిని ఇంటి కప్పుకి వేలాడదీయ వచ్చు. మూత బిగించిన ప్లాస్టిక్ బాటిల్ మధ్య భాగంలో వివిధ ఆకారాల్లో రంధ్రాలు చేసుకోవాలి. దాన్ని అడ్డంగా గోడకి సెట్ చేసి అందులో మట్టిపోసి ఇంట్లో పెరిగే చిన్నపాటి మొక్కల్ని పెంచుకోవచ్చు. లేకుంటే ప్లాస్టిక్ బాటిల్ నెక్ కట్ చేసి బాటిల్లో మొక్కల్ని పెంచుకోవచ్చు. ఇలా క్రియేటివిటీని బట్టి బాటిల్స్‌ని రకరకాలుగా ఇంట్లో అలంకరించుకోవచ్చు.