Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ్వుతో ఎన్నో ప్రయోజనాలు న్నప్పటికీ.. ఈ రోజుల్లో పెరిగిన జీవన వేగం కారణంగా రోజూ పట్టుమని 10 నిమిషాలైనా నవ్వలేని దుస్థితి. ఎవరి పనుల్లో వారు బిజీగా గడిపేస్తున్నారు. నవ్వు మనల్ని మానసికంగానే.. గాక శారీరకంగాను ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే ఆస్పత్రుల చుట్టూ తిరగడం కంటే రోజులో కాసేపు మనస్ఫూర్తిగా నవ్వితే చాలంటున్నారు నిపుణులు. నవ్వుతో ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలిస్తే మనం ఆశ్చర్యపోకతప్పదు.
నవ్వు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒత్తిడిని కలిగించే హార్మోన్ల ఉత్పత్తిని కట్టడి చేస్తుంది.
నొప్పులు, వాపుల తీవ్రతను తగ్గిస్తుంది.
నవ్విన ప్రతిసారీ వందలాది కండరాలు రిలాక్స్ అవుతాయి. హదయ సంబంధిత సమస్యల బెడద తగ్గుతుంది. మెదడుతో సహా పలు అవయవాలకు తగినంత ప్రాణవాయువు అందుతుంది.
ఇతరులతో పోల్చినప్పుడు హాస్య ప్రియులు మరింత యవ్వనంగా కనిపిస్తారు.
నవ్వు మనల్ని ఎల్లప్పుడూ ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది. లేనిపోని భయాలు, ఆందోళనలు తొలగిపోతాయి. మానసిక ఒత్తిడిని అధిగమించే సామర్ధ్యం పెరుగుతుంది.
ఎదుటివారి నమ్మకాన్ని, సహానుభూతిని పొందుతాము. చక్కని ఏకాగ్రత, గ్రహణ శక్తి సొంతమవుతుంది.
అలాగే సామాజికంగా.. కుటుంబ సభ్యులు, పొరుగువారితో బంధాలు బలపడతాయి. నవ్విస్తూ మాట్లాడే వ్యక్తికి నలుగురిలో ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అతనితో మాట్లాడేందుకు అందరూ ఆసక్తి చూపుతారు.
పదిమందితో కలిసి కలిసి పనిచేసే తత్త్వం, చొరవ, నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ప