Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజ్ వాటర్: ఒక చిన్న కప్‌లో రోజ్‌వాటర్ తీసుకుని.. అందులో ఒక చుక్క గ్లిజరిన్, పావు టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ ద్రావణాన్ని దూదితో ముఖానికి అప్లై చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
గుడ్డు: చర్మ సౌందర్యానికి గుడ్డు భలేగా పని చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ గుడ్డు తెల్లసొనకు సగం టేబుల్ స్పూన్ మీగడ, సగం టేబుల్ స్పూన్ నిమ్మ రసం బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మీ అందం మరింత పెరుగుతుంది.
క్యారెట్: విటమిన్-ఎ అధికంగా ఉండే క్యారెట్ ఆరోగ్యానికే కాదు అందానికీ దోహదం చేస్తుంది. క్యారెట్ ముక్కలు, సగం ఆలుగడ్డ ఉడికించాలి. తర్వాత వాటిని ముద్దగా చేసుకోవాలి. దీనికి చిటికెడు వంటసోడా, పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఐదు నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
కొబ్బరి పాలు: కొబ్బరిపాలు సహజ సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తాయి. పొడి చర్మం ఉన్నవాళ్లు.. కొబ్బరిపాలు ఉపయోగించడం మంచిది. దూదితో కొబ్బరిపాలను ముఖానికి రాసుకుని.. ఆపై బాగా మర్దనా చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే చాలు అదనపు సౌందర్యం మీ సొంతం అవుతుంది.