Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముఖానికి నవ్వు ఎంత అందాన్నిస్తుందో పెదవుల నాజూకుదనం ఆ నవ్వుకు మరింత అందాన్నిస్తుంది. కొందరి ముఖం చక్కని ఛాయతో ఉన్నా పెదవులు మాత్రం నల్లగా ఉంటాయి. కొందరికి వాతావరణాన్ని బట్టి నల్లబడి ఇబ్బందిపెడుతుంటాయి. అలాంటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే సరి
- దానిమ్మ గింజల్ని పేస్ట్ చేసి.. అందులో కొద్దిగా పాల మీగడ, రోజ్‌వాటర్ వేసి కలపాలి. దీనితో పెదవులను బాగా రుద్ది ఆరిన తర్వాత కడిగేయాలి. రోజూ ఇలా చేస్తే నలుపు పోయి పెదవులు మంచి రంగులోకి మారతాయి.
- కొన్ని గులాబి రేకులను మెత్తని పేస్ట్‌లా చేసు కోవాలి. దీనిలో కొంచెం తేనె, పాలమీగడ, వెన్నవేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో వారానికి రెండు సార్లు పెదవులను మసాజ్ చేస్తే నలుపు పోతుంది.
- గులాబి రేకులను పాలలో వేసి నానబెట్టాలి. తర్వాత పేస్ట్ చేసి తేనె, చిటికెడు కుంకుమపువ్వు కలపాలి. దీన్ని పెదవులకు రాసి పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.
- క్యారెట్ రసాన్ని, బీట్రూట్ రసాన్ని సమపాళ్లలో కలిపి దానితో పెదవులపై సన్నితంగా పదినిమిషాల పాటు రుద్దాలి. ఆరిన తర్వాత గోరువచెచ్చని నీటితో కడిగేసుకోవాలి. రోజుకోసారి ఇలా చేస్తే రెండు వారాల్లో ఫలితం కనిపిస్తుంది.
- చెంచాడు స్ట్రాబెర్రీ జ్యూస్‌లో రెండు చెంచాల పెట్రోలియం జెల్లీ వేసి రోజూ రుద్దుకున్నా ఫలితం ఉంటుంది.