Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యోగ వల్ల శరీరాకృతి మెరుగు కావడమే కాకుండా మనసుకు ప్రశాంత లభిస్తుంది. కొన్ని ఆసనాలు సాధన చేయడం ద్వారా శరీరం, మనసు తేలికపడుతాయి. అలాంటి వాటిలో వాయవ్యాసనం ఒకటి. రోజూ ఈ ఆసనం సాధన చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.
వాయవ్యాసనం
ముందుగా నిటారుగా నిలబడాలి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ చేతులు పైకి లేపాలి. ఆ తర్వాత నెమ్మదిగా ముందుకు వంగాలి. శ్వాస వదులుతూ శరీరాన్ని సమతుల్యం చేసుకుంటూ కుడికాలిని 90డిగ్రీల కోణం వరకు పైకి ఎత్తాలి. ఈ స్థితిలో రెండు చేతులు ముందుకు చాచి శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ ఆసనంలో ఇరవై సెకండ్ల నుంచి నిమిషం వరకు ఉండవచ్చు. ఆ తర్వాత నెమ్మదిగా కుడికాలు కింద పెట్టి ఇదే విధంగా ఎడమకాలితో చేయాలి. ఎడమకాలిని 90కోణంలోకి నెమ్మదిగా శ్వాస వదులుతూ రెండుచేతులు ముందుకు చాపుతూ తీసుకురావాలి. ఈ ఆసనంలోఇరవై సెకండ్ల నుంచి నిమిషం వరకు ఉండవచ్చు.
ఉపయోగాలు..
- శరీరం మనసు సమతుల్యం పెరుగుతుంది.
- ఏకాగ్రత పెరుగుతుంది.
- శరీరాకృతి మెరుగవుతుంది.
జాగ్రత్తలు..
- శరీరాన్ని జాగ్రత్తగా సమతుల్యం చేసుకుంటూ ఈ ఆసనం వేయాలి.