Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలివ్ ఆయిల్
పొడిబారిన జుట్టు మెత్తగా, పట్టులా కావాలంటే గోరువెచ్చని ఆలివ్ ఆయిల్‌ను శిరోజాలకు పట్టించాలి. నలభైఐదు నిమిషాల తరువాత షాంపూ స్నానం చేసుకోవచ్చు.
అవకడో, కొబ్బరి పాలు
అవకడోలో ఉండే నూనె, కొబ్బరిపాలు దెబ్బతిన్న జుట్టును బాగుచేయడానికి అద్భుతంగా ఉపకరిస్తాయి. ఒక అవకడోను తీసుకుని పేస్ట్ మాదిరిగా చేసి అందులో గుడ్డు పచ్చసొన, కొబ్బరిపాలు కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్‌ను చిన్నగా తలపై మర్దన చేస్తూ జుట్టుకు పట్టించాలి. ఒక అరగంటపాటు అలా వదిలేసి తరువాత షాంపూతో స్నానం చేయాలి.
పెరుగు
పొడిబారినజుట్టుకు పెరుగు సహజ కండిషనర్‌గా ఉపకరిస్తుంది. ఒక టీస్పూన్ యాపిల్ సిడార్ వెనిగర్, ఒక టీస్పూన్ తేనె, అరకప్పు పెరుగు కలిపి కుదుళ్లకు, జుట్టుకు బాగా పట్టించాలి. పావుగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.
బ్లాక్‌టీ
పొడిబారిన జుట్టు సహజసిద్ధమైన మెరుపును సొంతం చేసుకోవాలంటే బ్లాక్‌టీని జుట్టుకు పట్టించండి. బ్లాక్‌టీ జుట్టు రంగును మెరుగుపరచడమే కాకుండా, మెరుపునిస్తుంది.
వెన్నతో మసాజ్
పొడిబారినట్టుగా ఉండి, శిరోజాల చివర్లు చిట్లిపోతే వెన్నతో మసాజ్ చేసుకోవాలి. తరువాత షవర్ క్యాప్‌తో శిరోజాలను కవర్ చేసుకుని అరగంట తరువాత షాంపూతో స్నానం చేయాలి.
యాపిల్ సిడార్ వెనిగర్ మాస్క్
దెబ్బతిన్న జుట్టుకు అద్భుతమైన హౌమ్ రెమిడీ ఇది. ఒక టీస్పూన్ యాపిల్ సిడార్ వెనిగర్, రెండు టేబుల్స్పూన్ల ఆలివ్ ఆయిల్, మూడు ఎగ్వైట్లు కలిపి పేస్ట్ మాదిరిగా చేసుకుని జుట్టుకు పట్టించాలి. తరువాత షవర్ క్యాప్‌తో హెయిర్‌ను కవర్ చేసి పెట్టాలి. అరగంట తరువాత షాంపూతో స్నానం చేయాలి.
గుడ్డుపచ్చసొన
జుట్టు దెబ్బతింటోంది అంటే సరైన పోషణ లేదని అర్థం. జుట్టుకు సరైన పోషకాలు అందాలంటే గుడ్డు పచ్చసొనను పట్టించండి. ఇది కండిషనర్‌గా, మాయిశ్చర్‌గా పనిచేస్తుంది. గుడ్డు పచ్చసొనను జుట్టుకు పట్టించాక ఒక గంటపాటు వదిలేసి తరువాత పర్ఫ్యూమ్డ్ షాంపూతో స్నానం చేయాలి.