Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మైగ్రేన్ తలనొప్పి ఉన్న వారి బాధ వర్ణనాతీతం. తలనొప్పి తగ్గే వరకు గదికే పరిమితమై పోతారు. మైగ్రేన్‌కు కారణం కొన్ని రకాల కెమికల్స్ రిలీజ్ కావడమే. ఈ కెమికల్స్ అలర్జిక్ రియాక్షన్, స్టెస్ర్, మెనోపాజ్, రుతుచక్రం సమయంలో విడుదలవుతాయి. అయితే మైగ్రేన్‌తో బాధపడుతున్నవారు ఈ కింది జాగ్రత్తలు ఫాలో కావడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.
విటమిన్ బి2 : రోజూ 400 ఎంజి విటమిన్ బి2 తీసుకుంటే మైగ్రేన్ లక్షణాలు తగ్గుముఖం పడతాయి. చికెన్, చేపలు, కోడిగుడ్లు, డైరీ ఉత్పత్తులు, నట్స్, ఆకుకూరలు, తణధాన్యాలలో విటమిన్ బి2 ఎక్కువగా లభిస్తుంది.
థెరపీ : రిలాక్సేషన్ థెరపీలు మంచి ఫలితాన్ని చూపిస్తాయి. తలకు మసాజ్ చేసుకోవడం, యోగా, మెడిటేషన్ వంటివి మైగ్రేన్‌ను తగ్గించడానికి బాగా పనికొస్తాయి.
ఐస్ : నొప్పిని తగ్గించడానికి ఐస్ బాగా పనికొస్తుంది. మైగ్రేన్‌తో బాధపడుతున్న వారికి కోల్డ్థెరపీ క్విక్ రిలీఫనిస్తుంది.
నియాసిన్ : తీసుకునే ఆహారంలో నియాసిన్ అధికంగా ఉండేలా చూసుకోవాలి. గోధుమలు, ఆకుకూరలు, టమోటాలు, నట్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, కాలేయం, చేపలు, ఈస్ట్‌లో నియాసిన్ అధికంగా ఉంటుంది.