Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డెలివరీ తరువాత తీసుకోవాల్సిన ఆహారంపై చాలామందిలో అపోహలుంటాయి. నీళ్లు ఎక్కువగా తాగకూడదు. పప్పు తినకూడదంటుంటారు. నీళ్లు ఎక్కువగా తాగడం మూలంగా పొట్ట వస్తుందనేది అపోహ మాత్రమేనంటున్నారు వైద్యులు. పప్పులో ప్రొటీన్స్ ఉంటాయి. కాబట్టి పప్పును దూరపెట్టడం శ్రేయస్కరం కాదంటున్నారు..
- డెలివరీ తరువాత ప్రతీ తల్లి శారీరక అంశాలపై దష్టి పెట్టాలి. ఇంట్లో తల్లిదండ్రులు డెలివరీ తరువాత నాలుగైదు రోజుల వరకు స్నానం చేయనివ్వరు. కానీ అది కూడా తప్పేనంటున్నారు వైద్యులు. రెగ్యులర్గా స్నానం చేయాలని సూచిస్తున్నారు.
- మసాజ్ చేయించుకుంటే మరీ మంచిదంటున్నారు. కండరాలు పటుత్వం కోల్పోకుండా ఉంటాయంటున్నారు. సిజేరియన్ అయినట్లయితే కుట్ల దగ్గర కాస్త జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నారు. అలాగే నెలకొకసారి మూడునెలలపాటు వైద్యులను సంప్రదించాలి.
- గర్భం దాల్చినప్పటి నుంచి వేసుకుంటూ వస్తున్న ఐరన్, కాల్షియం మాత్రలను డెలివరీ తరువాత చాలామంది ఆడవాళ్లు మానేస్తుంటారు. కానీ అది కూడా మంచిది కాదంటున్నారు వైద్యులు. డెలివరీ తరువాత కూడా మూడు నెలల పాటు ఆ మందులను తప్పనిసరిగా వాడాలట. అప్పుడే రక్తహీనత సమస్య రాకుండా ఉంటుందంటున్నారు. కాబట్టి ఆహారంపై ఆంక్షలు పెట్టుకోకుండా ఆకుకూరలు, పండ్లు, పప్పులు అధికంగా తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు.