Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బంగారు ఆభరణాలతో పాటు మార్కెట్లో రోల్డ్‌గోల్డ్ ఆభరణాలకూ ఎక్కువ డిమాండ్ ఉంది. కానీ వీటిని జాగ్రత్తగా వాడకపోతే తొందరగా పాడైపోయే అవకాశం ఉంది. అందుకే ఎక్కువ రోజులు మన్నికగా ఉండాలంటే ఈ టిప్స్ పాటిస్తే సరి.
- ఆభరణాలకు తరచుగా నీళ్లు తగిలితే త్వరగా షైనింగ్ కోల్పోతాయి. అందుకే ఎక్కువ కాలం నగలు మన్నిక రావాలంటే నీటిలో అవి తడవకుండా చూసుకోవాలి.
- త్వరగా మేకప్ అయ్యే తొందరలో.. మనం వాడే డియోడ్రెంట్స్, పెర్‌ఫ్యూమ్‌లూ జ్యువెలరీస్ పైన పడతాయి. దీని వల్ల నగలు త్వరగా చెడిపోయే అవకాశం ఉంది.
- ఎలాగూ రోల్డ్‌గోల్డ్ నగలే అని ఎక్కడంటే అక్కడ పెట్టేయకండి. వాటిపై మర కలు పడటం వల్ల కాంతి తగ్గిపోతుంది. దీంతో పాటు దుమ్మును తొలగిం చటానికి టిష్యూలు, దుస్తులతో గట్టిగా తుడవడం వల్ల వాటిపై గీతలు పడతాయి. మన్నిక తగ్గుతుంది.
- డ్యామేజ్ ఉన్న ఆభరణాల్ని క్లీన్ చేస్తే మాత్రం ఇంకా పాడైపోతాయి. నగలను శుభ్రపరచాలనుకుంటే గోరు వెచ్చటి నీటితో మైల్డ్ సోప్‌ను ఉపయోగించాలి. టూత్‌బ్రష్ సహాయంతో క్లీన్ చేయాలి. ఇంకా లోపల ఉండే మట్టిపోకుంటే టూత్‌పిక్‌ని వాడి తీసేయాలి. చివరగా వాటిని తుడవడానికి సున్నితమైన క్లాత్‌ను వాడాలి.