Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆడపిల్లలపై దాడులు పెరుగుతున్న ప్రస్తుత కాలంలో ప్రతినిమిషం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాలేజీ అమ్మాయిలను వేధించడానికి ఎక్కువగా యాసిడ్ దాడులకు పాల్పడుతుంటారు. ప్రేమ ఒప్పుకోలేదనో, పగతోనో ఈ దాడులకు పాల్పడుతారు. క్షణికావేశంలో దాడులకు పాల్పడి జీవితాలను కష్టాలపాలు చేసుకుంటారు. అలాంటి వారికి తగిన బుద్ధి ఎలా చెప్పాలో తెలుసుకుందాం.
స్టెప్ 1
యాసిడ్ బాటిల్ ను తీసుకుని రోడ్డుపై ఒంటరిగా వెళ్ళుతున్న అమ్మాయిని బెదిరిస్తూ దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఒక వ్యక్తి.
స్టెప్ 2
తనపై దాడికి వస్తున్న వ్యక్తిని చూడగానే ఏ మాత్రం భయపడకుండా యాసిడ్ పట్టుకున్న చేయి ఎల్బో వద్ద తన కుడిచేతితో గట్టిగా కొట్టాలి. దాంతో పట్టుతప్పి యాసిడ్ అతని ముఖంపైనే పడేలా ఎడమచేతిలో అతని చేతిని బలంగా వెనక్కి కొట్టాలి.
స్టెప్ 3
ముఖంపై యాసిడ్ పడటంతో ఆ వ్యక్తి బాధ భరించలేక కింద పడిపోతాడు. అప్పుడు అతని చేయిని మెలితిప్పుతూ తలని నేలపై బలంగా కొట్టాలి.