Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూడు కప్పుల నీళ్లలో ఓ కప్పు వెనిగర్ వేసి కలపాలి. స్ట్రాబెర్రీస్, గ్రేప్స్ లాంటి పండ్లని ఈ నీటితో కడిగి, బట్టతో తుడిచి, ఆ పైన మూతగట్టిగా ఉండే డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో ఉంచితే కొన్ని వారాలపాటు పాడవకుండా ఉంటాయి.
- దుమ్ము కారణంగా కారు హెడ్‌లైట్స్ మీది అద్దాలు డల్‌గా అయిపోతే.. ముందుగా టూత్‌పేస్ట్‌తో రుద్ది, ఆ పైన మెత్తని బట్టతో తుడిచెయ్యాలి. అద్దాలు కొత్తవిలా మెరుస్తాయి. కార్పెట్‌కి బబుల్ గమ్ అతుక్కుపోతే.. ఓ ఐస్‌ముక్క తీసుకుని, గమ్ మీద బాగా రుద్దండి. కాసేపటికి ఊడి వచ్చేస్తుంది.
- చెక్క గరిటెలకు నూనె జిడ్డు అంటుకుని వదలకపోతే వాటి మీద కాస్త టేబుల్ సాల్ట్ చల్లి, టిష్యూ పేపర్‌తో తుడవాలి.
- బెండకాయలకు మొదలు, చివర తుంచేసి ఒక ప్లాస్టిక్ కవర్లో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేస్తే అవి తాజాగా ఉంటాయి.
- అల్లం-వెల్లుల్లి పేస్ట్ రంగు మారకుండా ఉండా లంటే, వాటిని మిక్సీలో వేసే ముందు కొద్దిగా వేయించుకోవాలి. ఇలాచేస్తే చాలా రోజులపాటు ఆ పేస్ట్ తాజాగా ఉంటుంది.
- ఆకుకూరలు ఉడకబెట్టిన నీళ్లు పారబోయకుండా వాటిని మరో గిన్నెలోకి తీసుకొని సూప్ తయారీలో వాడుకోవచ్చు. ఇలా చేస్తే అందులోని విటమిన్స్, మినరల్స్ వృథాకావు. అప్పడాలు ఉంచిన డబ్బాలో కొన్ని బియ్యపు గింజలు కానీ, సెనగపప్పు కానీ వేయాలి. అలా చేస్తే అప్పడాలు మెత్తబడకుండా ఉంటాయి.