Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముందుగా కాలుచాపి కూర్చోవాలి. ఆ తర్వాత మెల్లగా వజ్రాసనంలోకి రావాలి. రెండు అరిచేతులను కాలి మడత మధ్యలో వచ్చేలా పెట్టాలి. ఈ స్థితిలో కూర్చోని శ్వాస తీసుకుంటున్నపుడు కన్నుబొమ్మల మధ్య వరకు వచ్చేలా, శ్వాస వదిలేటప్పుడు కన్నుబొమ్మల మధ్య నుంచి, ముక్కులో నుంచి గాలి బయటకు వస్తుండేలా భావించాలి. ఇలా నిమిషం నుంచి ఐదు నిమిషాల వరకు శ్వాస తీసుకుంటూ, వదులుతూ సాధన చేయాలి.
ఉపయోగాలు..
- మోకాలి సమస్యలు తగ్గుతాయి
- ప్రశాంతత చేకూరుతుంది.
- జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది.
- ఏకాగ్రత పెరుగుతుంది.
జాగ్రత్తలు..
- మోకాలి నొప్పులు ఎక్కువగా ఉన్నవారు ఈ ఆసనం సాధన చేయవద్దు.