Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణలో పండుగ అంటేనే మాంసాహారం. మాంసాహారం ఎక్కువగా తీసుకుంటే.. అనారోగ్యం, బరువు వచ్చి చేరతాయి. అవేవీ లేకుండా బాడీని డిటాక్స్ చేసే కొన్ని డ్రింక్స్, స్మూతీస్ ఉన్నాయి. అవి చేసుకుని తాగి... పండుగ పూట బరువును దించేయండి.
కలర్‌ఫుల్ డ్రింక్
కావల్సిన పదార్థాలు:
బెల్ పెప్పర్లు - 1, క్యారెట్స్ - 3, సాధారణ సైజ్ దోసకాయ -1, నిమ్మకాయ - సగం ముక్క, యాపిల్ - 1
తయారు చేసే విధానం:
అన్ని పదార్థాలను జ్యూస్ చేసుకోవాలి. జ్యూస్‌గా తీసిన వెంటనే ఆ రసాన్ని తాగేయాలి. లేదంటే అందులోని పోషకాలు, ఔషధ విలువలు తగ్గిపోతాయి. రోజుకు కనీసం 2 గ్లాసుల మోతాదులో ఈ జ్యూస్‌ను తీసుకుంటే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. విషపదార్థాలన్నీ బయటికి వెళ్లిపోతాయి.
టమాట, క్యారెట్స్ స్మూతీ
కావల్సిన పదార్థాలు:
టమాటాలు - 2 ముక్కలు, క్యారెట్లు - 2 ముక్కలు, నిమ్మకాయ - సగం ముక్క, కొత్తిమీర - ఒక కట్ట, కాల్చిన జీలకర్ర - 1 స్పూన్, పెప్పర్, ఉప్పు-రుచికి సరిపడా, నీరు - 100 మి.లీ.
తయారు చేసే విధానం:
టమాటా తొక్కలు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యారెట్లను తురుముకోవాలి. ఆకుకూరలను కోయాలి. ఆపై అన్ని పదార్ధాలను బ్లెండ్ చేయాలి. వాటిపై సగం నిమ్మకాయ రసం పిండి, ఒక నిమిషం పాటు బాగా కలపాలి. అంతే టమాటా , క్యారెట్స్ స్మూతీ రెడీ!
గ్రీన్ టీ సిట్రస్ ట్విస్ట్
కావల్సిన పదార్థాలు:గ్రీన్ టీ - సగం కప్పు (చల్లారింది), నిమ్మకాయ - సగం ముక్క, అరటిపండు - 1 (మిశ్రమంగా కలిపింది)
తయారు చేసే విధానం:
అన్ని పదార్థాలను స్మూత్ మిక్స్ వచ్చే వరకు కలపాలి. వెంటనే తాగేయాలి. ఇందులోని 'ఈజీసీజీ' అనే ఔషధం శరీరంలోని విష పదార్థాలన్నింటినీ బయటికి పంపించి వేస్తుంది.
టర్మరిక్ డ్రింక్
కావల్సిన పదార్థాలు:
పసుపు - ఒక టీస్పూన్, అల్లం రసం- ఒక టీస్పూన్, నిమ్మకాయ రసం - రెండూ టీస్పూన్లు, నీరు - సగం కప్పు
తయారు చేసే విధానం:
అన్ని పదార్థాలను మిశ్రమంగా కలుపుకోవాలి. వెంటనే తాగేయాలి. పేగులు, జీర్ణాశయ వ్యవస్థను ఇది శుభ్రం చేస్తుంది. లివర్‌లోని వ్యర్థాలు తొలగించబడతాయి.
పైనాపిల్ స్మూతీ
కావల్సిన పదార్థాలు:
అరటి పండు- 1, పైనాపిల్ ముక్కలు - 1 కప్పు, తరిగిన బచ్చలికూర - 2 కప్పులు, కొబ్బరి నీళ్ళు - ఒక కప్పు
తయారు చేసే విధానం:
అరటిపండును ముక్కలుగా చేసి, పైనాపిల్ ముక్కలతో కలిపి బ్లెండ్ చేయాలి. బచ్చలికూర వేసి, ఒక గ్లాసు నీరు పోసి బాగా గిలక్కొట్టాలి. అంతే పైనాపిల్ స్మూతీ రెడీ!
ఆపిల్, బచ్చలికూర స్మూతీ
కావల్సిన పదార్థాలు:
బచ్చలికూర - 100 గ్రా, ఆకుపచ్చ ఆపిల్ - 1, ఫెన్నెల్ - గడ్డ, కొత్తిమీర - కాండం, తేనె - 1 స్పూన్, నీరు - 1 కప్పు
తయారు చేసే విధానం:
అన్ని ఆకుకూరలను కోయాలి. ఆపిల్ తొక్క తీసి ముక్కలు చేయాలి. ఆపై అన్ని పదార్ధాలను కలిపి, నీరు పోసి, బ్లెండర్ సహాయంతో మిక్స్ చేయాలి. ఆకుపచ్చ కాక్టెయిల్ స్మూతీ మీకు ఇష్టమైన పానీయంగా మారుతుంది.