Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నువ్వులను ఏ రూపంలో తీసుకున్నా అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. అలాంటి ప్రయోజనాలు కొన్ని....
- నువ్వులను మెత్తగా నూరి కాలిన గాయాలు, బొబ్బలపై రాసుకుంటే గాయాలు త్వరగా తగ్గుతాయి. నువ్వులను మెత్తగా నూరి, కాస్త నిమ్మరసం కలిపి పెట్టుకున్నా ఉపశమనం లభిస్తుంది.
- ఆలివ్ ఆయిల్‌కు ప్రత్యామ్నాయంగా దీన్ని ఉపయోగించవచ్చు.
- నల్ల నువ్వుల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. నల్ల నువ్వులను మెత్తగా నూరి రెండు, మూడు గంటల పాటు వేడి నీళ్లలో నానబెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాలతో కలిపి తీసుకుంటే ఎనీమియా రోగులకు మంచి ఫలితం ఉంటుంది. రక్తహీనత సమస్య తగ్గిపోతుంది.
- రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను కాసేపు వేయించి మెత్తగా చేసి పెట్టుకోవాలి. ఈ నువ్వుల పొడిని మేకపాలతో కలిపి రోజూ మూడు పూటలా, ఆరురోజుల పాటు తీసుకుంటే డయేరియా తగ్గిపోతుంది.
- పైల్స్‌ను తగ్గించడంలోనూ నువ్వులు చాలా ఉపకరిస్తాయి. కషాయం రూపంలో గానీ, తియ్యటి పాయసం రూపంలో గానీ తీసుకోవచ్చు. నువ్వులను క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల పైల్స్ సమస్య నుంచి చక్కటి ఉపశమనం లభిస్తుంది.
- నువ్వులకు ఒక టేబుల్ స్పూన్ అవిసెలు, ఒకస్పూన్ తేనె, చిటికెడు ఉప్పు కలుపుకుని ప్రతిరోజు రాత్రి పడుకొనే ముందు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బ్రాంకైటిస్, నిమోనియా, ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధ వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
- అర టీ స్పూన్ నువ్వుల పొడిని వేడి నీళ్లతో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే రుతుసంబంధ సమస్యలు తొలగిపోతాయి.