Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొద్దున్న లేచినప్పటి నుంచి క్షణం తీరిక లేకుండా పనులతో సతమతమ వుతున్నారా? తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారా? ఆ ఒత్తిడిని అధికమించడానికి... రోజంతా చిరునవ్వుతో పని చేయడానికి.... కొన్ని టిప్స్ ఉన్నాయి. వాటిని పాటిస్తే అలసట తెలియదు. అంతేకాదు మీ చక్కటి పనితీరు వల్ల ఇంట్లో, ఆఫీసులో కూడా అందరి మెప్పునూ పొందుతారు. మరెందరినో ఆత్మీయుల్ని చేసుకోగలుగుతారు.
చిన్న చిరునవ్వు: పెదాల మీద చిరునవ్వు మిమ్మల్ని నలుగురిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. అన్నివేళల్లోనూ మీరు ప్రశాంతంగా, కూల్‌గా ఉంటారు. అంతేకాదు చిరునవ్వు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పని ఒత్తిడిని అధిగమించగలిగేలా చేస్తుంది. ఎలాంటి డిప్రషన్కూ లోనవరు. మీ చుట్టూరా ఉన్న వారందరూ మీకు దగ్గరవుతారు. దాంతో ఇంట్లోగాని, ఆఫీసులో గాని ఎంతటి కష్టమైన పనినైనా సులువుగా చేయగలుగుతారు.
డీప్ బ్రీత్: ఊపిరితిత్తుల్లోపలికంటా గాలి వెళ్లేలా శ్వాస తీసుకోవాలి. ఇలా చేయడంవల్ల ప్రాణవాయువు ఎక్కువ పరిమాణంలో శ్వాసనాళాల్లోకి వెడుతుంది. అంతేకాదు రక్త ప్రవాహంలో కూడా కలుస్తుంది. తరచూ డీప్ బ్రీత్ చేయడం వల్ల ఒత్తిడికి లోనుకారు. అన్నివేళలా ప్రశాంతంగా ఉంటారు.
యోగ: నిత్యం యోగా చేయడం చాలా మంచిది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. యోగా చేయడం వల్ల ఎప్పుడూ ఉల్లాసంగా ఉంటారు. క్రీడల్లో సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కూడా యోగ ఎంతగానో ఉపకరిస్తుంది. ఆర్థరైటిస్ వంటి అనారోగ్య సమస్యలున్నా యోగా వల్ల తగ్గుతాయి. అయితే యోగా చేయడానికి ముందు వైద్యుని సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.
నిటారుగా కూర్చోవాలి: శరీరం ఆరోగ్యంగా ఉండడమనేది మనం కూర్చున్న పద్ధతిని బట్టి కూడా ఉంటుంది. కుర్చీలో నిటారుగా కూర్చుని పనిచేయాలి. అలా చేయడం వల్ల క్రీడల్లో గాయాలు తగిలే అవకాశం తక్కువ . అలాగే వ్యాయామాలు చేసేటప్పుడు కూడా తొందరగా గాయాల బారిన పడరు. నిటారుగా కూర్చోవడం వల్ల మరో లాభం కూడా ఉంది. శ్వాస సరిగా పీలుస్తాం. దీంతో శరీరానికి ఆక్సిజన్ సమంగా అందుతుంది. ఆక్సిజన్ శరీరానికి తక్కు వ అందడం వల్ల వచ్చే తలనొప్పిలాంటి సమస్యలు తలెత్తవు.