Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరోగ్యానికి వెల్లుల్లి చేసే మేలు అంతా ఇంతా కాదు. ప్రత్యేకించి వానా, చలికాలాల్లో సర్వ రోగ నివారిణి. సూప్‌లో వేసినా, పచ్చల్లో వేసి దంచి తిన్నా, పచ్చిది తిన్నా, అల్లంతో కలిపి కూరలో వేసినా దాని ప్రయోజనాలు అందుతాయి.అలాంటిది నేరుగా వెల్లుల్లితోనే రెసిపీస్ చేస్తే.. సూపర్ కదా! అలాంటి వెల్లుల్లి రెసిపీస్ మీకోసం!
గార్లిక్ చికెన్ రైస్
కావలసిన పదార్థాలు:
ఉల్లిపాయలు - పావు కప్పు, క్యాప్సికమ్ - అర కప్పు, వెల్లుల్లి రెబ్బలు -4, రైస్ - అర కప్పు, వెజిటబుల్ ఆయిల్ - 2 స్పూన్లు, నిమ్మరసం - పావు కప్పు, చికెన్ బ్రెస్ట్ -1, అల్లం-2 స్పూన్లు, సోయాసాస్ - 2 స్పూన్లు, తేనె - 1 స్పూన్, చికెన్ బ్రో - అర కప్పు, పార్టీ - 1 స్పూన్, ఉప్పు - తగినంత
తయారీ విధానం:
ఒక బౌల్ తీసుకుని అందులో చికెన్, ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, నూనె, ఉప్పు, నిమ్మరసం వేసి మొత్తం మిశ్రమాన్ని కలిపి మ్యారినేట్ చేసి ఒక గంట పక్కన పెట్టుకోవాలి. డీప్ బాటమ్ పాన్ తీసుకుని అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యం వేయాలి. తర్వాత అందులోనే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేయాలి. తర్వాత బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు అందులోనే రెడ్ బెల్ పెప్పర్, సోయాసాస్ వేసి మరోసారి మిక్స్ చేయాలి. తర్వాత చికెన్ ఉడికించిన మ్యారినేట్ పోసి, మరో పది నిమిషాలు ఉడికించుకోవాలి. మూత తీసి రైస్ మెత్తగా ఉడికిందో లేదో చూసి చేసి మెత్తగా ఉడికే వరకు మరోసారి ఉడికించుకోవాలి. చివరగా కొద్దిగా పార్టీ తరుగుతో గార్నిష్ చేసి సో ఆఫ్ చేయాలి. అంతే గార్లిక్ చికెన్ రిసిపి సర్వే చేయడానికి రెడీ
గార్లిక్ ర్యాపర్స్
కావలసిన పదార్థాలు:
ఆలివ్ ఆయిల్ - అరకప్పు, వెల్లుల్లి - 3 రెబ్బలు (సన్నగా తరగాలి), ఛీజ్ తురుము - కప్పు, వాంటన్ ర్యాపర్స్ - 200 గ్రాముల ప్యాకెట్ (వీటిని ఇంట్లోనూ తయారు చేసుకోవచ్చు), ఉప్పు - తగినంత.
తయారీ విధానం:
రెండు కప్పుల మైదాలో గుడ్డు, పావు టీ స్పూన్ ఉప్పు, అర కప్పు నీళ్లు పోసి బాగా కలపాలి. చపాతీ పిండిలా కలిపి, పైన మూత పెట్టి అరగంట సేపు ఉంచాలి. తర్వాత చిన్న చిన్న ఉండలు తీసుకుని అప్పడాల కర్రతో పలచగా ఒత్తి, నాలుగు మూలలు వచ్చేలా కత్తితో కట్ చేసి పక్కన ఉంచాలి. వీటినే ర్యాపర్స్ అంటారు. మూకుడులో నూనె పోసి కాగనివ్వాలి. పైన చెప్పిన విధంగా కట్ చేసి ఉంచిన ర్యాపర్సును నూనెలో వేసి రెండు వైపులా కాల్చి తీయాలి. చిన్న గిన్నెలో ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి వేసి 30 నిమిషాల పాటు ఉంచాలి. తయారు చేసుకున్న ర్యాపర్సును రెండువైపులా వెల్లుల్లి, ఆలివ్ ఆయిల్ రాయాలి. సర్వ్ చేసే ముందు చిటికెడు ఉప్పు, మిరియాల పొడి, సన్నగా తరిగిన పుదీనా ఆకులు రెండు వైపులా చల్లాలి. కరకరలాడే ర్యాపర్సును టమాటా కెచప్‌తో సర్వ్ చేసుకోవచ్చు.
చిల్లి గార్లిక్ నూడుల్స్
కావలసిన పదార్థాలు:
నూడుల్స్ - 300 గ్రాములు, నువ్వుల నూనె - 2 టేబుల్ స్పూను ్ల, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగిన), పచ్చి మిరపకాయ - 1, క్యారెట్ - 1, క్యాబేజి - 1 కప్పు, యెల్లో కాప్సికం - 1/2, రెడ్ కాప్సికం - 1/2, ఆకుపచ్చ కాప్సికం - 1/2, ఉల్లి కాడలలోని తెల్ల గడ్డలు, వెనిగర్ - 2 టీస్పూన్లు, సొయా సాస్ - 2 టేబుల్ స్పూను ్ల, రెడ్ చిల్లి సాస్ - 1 టేబుల్ స్పూను, గ్రీన్ చిల్లి సాస్ - 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి - 1 టీస్పూన్, ఉల్లి కాడలు, నీళ్లు, ఉప్పు
తయారీ విధానం: ఒక బాండీ తీస్కుని, తగినన్ని నీళ్లు పోసి, తగినంత ఉప్పు వేసి నూడుల్స్ ఉడికించాలి. నూడుల్స్ 90 శాతం ఉడికిన తరువాత పొయ్యిమీద నుంచి తీసేసి వెంటనే వడకట్టుకోవాలి. ఇప్పుడు దానిపైన కొద్దిగా నూనె చల్లుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీస్కుని రెండు టేబుల్‌స్పూన్లు నువ్వుల నూనెలో, కాస్త సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ మరియు సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత సన్నగా,పొడుగ్గా తరిగిన క్యారెట్, ఒక గిన్నెడు సన్నగా తురిమిన క్యాబేజి, చిన్నగా తరిగిన ఒక సగం రెడ్ క్యాప్సికమ్, చిన్నగా తరిగిన ఒక సగం యెల్లో కాప్సికం, చిన్నగా తరిగిన ఒక సగం ఆకుపచ్చ కాప్సికం, చిన్నగా తరిగిన ఉల్లికాడలలోని తెల్ల గడ్డలను కూడా వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో రెండు టేబుల్‌స్పూన్లు వెనిగర్, రెండు టేబుల్‌స్పూన్లు సొయాసాస్, ఒక టేబుల్‌స్పూన్ రెడ్ చిల్లి సాస్, ఒక టేబుల్‌స్పూన్ గ్రీన్ చిల్లి సాస్, ఒక టీస్పూన్ మిరియాల పొడి కూడా వెయ్యాలి. చివరగా ఉడికించిన నూడుల్స్ వేసుకుని అన్నిటిని బాగా కలుపుకోవాలి. ఉల్లి కాడలతో గార్నిష్ చేసుకుని వేడివేడిగా వడ్డించుకుంటే చాలా బాగుంటుంది
గార్లిక్ నాన్
కావలసిన పదార్థాలు: మైదా- 2 కప్పులు, పెరుగు, గోరువెచ్చని పాలు- 1/2 కప్పు చొప్పున, వెన్న- 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు- రుచికి తగినంత, బేకింగ్ సోడా, పం చదార, బేకింగ్ పౌడర్- 1/2 టీ స్పూను చొప్పున, వెల్లుల్లి తరుగు- 3 టీ స్పూన్లు, కొత్తిమీర తరుగు- 2 టీ స్పూన్లు
తయారీ విధానం:
మైదాలో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి బాగా కలిపాక దానిలో పెరుగు, పంచదార, పాలు వేసి ముద్దగా కలిపి నాలుగైదు గంటలు నానబెట్టాలి. తరువాత చపాతీ పీట మీద పిండి చల్లి కాస్త మందంగా చపాతీలు ఒత్తి వాటిపై కొద్దిగా వెల్లుల్లి, కొత్తిమీర తరుగులు చల్లి పైపైన మరోసారి ఒత్తాలి. వెల్లుల్లి చల్లిన వైపున కాకుండా రెండో వైపున చపాతీని పెనానికి అంటించి తవా ఫ్రై చేయాలి.
గార్లిక్ రైస్
కావలసిన పదార్థాలు: సోనామసూరి బియ్యం- 100గ్రా., ఆవాలు -రెండు టీ స్పూన్లు, శనగపప్పు- పది గ్రా, పచ్చిమిర్చి- ఆరు, వెల్లుల్లి-100గ్రా (రేకులను విడదీసి ఒలుచుకోవాలి), కరివేపాకు-50 గ్రా, నెయ్యి- 50గ్రా, నిమ్మచెక్క- ఒకటి, ఎండుమిర్చి- రెండు, ఉప్పు- తగినంత
తయారీ విధానం:
అన్నాన్ని పలుకుగా వండి వెడల్పు పాత్రలో వేసి చల్లారనివ్వాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి కొంత కరివేపాకును వేయించి పక్కన
పెట్టాలి. మిగిలిన నేతిలో ఆవాలు, ఎండుమిర్చి, శనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తర్వాత అందులో వెల్లుల్లి రేకులు వేసి సన్నమంట మీద కొద్ది సెకన్ల పాటు వేగనివ్వాలి. ఇప్పుడు ఉప్పు, అన్నం కలిపి దించేయాలి. చివరగా నిమ్మరసం కలిపి, నేతిలో వేయించిన కరివేపాకుతో గార్నిష్ చేయాలి.