Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెంతి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ అంశాలు శ్వాసను తాజాగా ఉంచడంలో బాగా తోడ్పడతాయి. అందుకే ఈ ఆకుల్ని చూయింగ్ గమ్, మౌత్ ఫ్రెష్నర్స్, టూత్ పేస్ట్ తయారీలో ఉపయోగిస్తారు.
దీనిలో శ్వాసకోశ వ్యాధులను నిర్మూలించే అంశాలు కూడా సమద్ధిగా ఉన్నాయి. తులసి కేంద్ర నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచి, ఏకాగ్రతను పెంచుతుంది. శారీరకమైన నీరసాన్ని, నిస్సత్తువులను తొలగించడమే కాదు, మానసికమైన కుంగుబాటును కూడా పారదోలుతుంది.
మెంతి రసంలో జీర్ణశక్తిని పెంచే అంశాలు కూడా అపారంగా ఉన్నాయి. ఇందులోని యాంటీ-సెప్టిక్ అంశాలు ఆరోగ్యమైన చర్మాన్నివ్వడంతోపాటు మొటిమలు రాకుండా కూడా ఇది కాపాడుతుంది.
మెంతి, నిమ్మరసాల మిశ్రమాన్ని రోజూ ఒక గ్లాసు తీసుకుంటే శరీరంలోని మలినాలన్నీ బయటికి పోయి అంతర్భాగాల్లో ఎక్కడ ఏ వాపులు ఉన్నా తగ్గిపోతాయి.