Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మాయిలు అబలలు ఏమీ చేయలేరు అన్న భావన చాలామందిలో ఉంది. కానీ, అమ్మాయిలు తమ శక్తిని తెలుసుకుంటే మగవారి దాడులను తిప్పికొట్టవచ్చు.
స్టెప్ 1
దారిలో నడుస్తూ వెళ్తున్న అమ్మాయికి ఎదురుగా వచ్చిన ఒక వ్యక్తి ఆ అమ్మాయి జుట్టు పట్టుకున్నపుడు అతని చేతిని ఆమె తన రెండు చేతులతో గట్టిగా పట్టుకుని
ఎడమచేతి ఎల్బోతో లాక్ చేస్తూ కుడివైపు తిరిగింది.
స్టెప్ 2
వెంటనే తన రెండు చేతులతో అతని చెయ్యిని మెలితిప్పుతూ బొటనవేళ్ళతో అతని మధ్యవేలు భాగంలో గట్టిగా నొక్కుతూ ముందుకు లాగింది. దాంతో ఆ వ్యక్తి భరించలేని నొప్పితో ముందుకు పడిపోతాడు.
స్టెప్ 3
ఆ వ్యక్తికి తప్పించుకునే వీలు లేకుండా తర్వాత ఆమె తన ఎడమకాలితో అతని మోకాలి దగ్గర గట్టిగా తొక్కింది.
స్టెప్ 4
అతనికి పారిపోయే అవకాశం ఇవ్వకుండా అతని చేతిని పట్టుకుని రిప్స్లో తన కుడికాలితో బలంగా కిక్ చేసింది. బాధతో అతను కిందపడగానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది.