Authorization
Mon Jan 19, 2015 06:51 pm
థాంక్యూ... ఈ ఒక్క చిన్న మాటకి ఎంత శక్తి వుందో తెలుసా? మోడువారిన బంధం చిగురించేంత. ఒకరి సాయం పొందగానే కతజ్ఞత తెలుపుతూ థాంక్స్ అంటాం. అయితే ఆ పదాన్ని ఇంటి బయట రోజుకి ఎన్నోసార్లు వాడే మనం మన ఇంట్లోవాళ్ళతో మాత్రం చాలా తక్కువ వాడతాం. అందులోనూ భార్యాభర్తల మధ్య ఆ పదం చాలా తక్కువగా వినిపిస్తుంది. ఒకరిమీద ఒకరికి వుండే అసంతప్తితో 'థాంక్స్' చెప్పరనేది కూడా ఒక అధ్యయనంలో తేలింది. థాంక్స్ అన్న పదం వినగానే ఎదుటి మనిషి మనసు తేలికపడటం, అందులోనుంచి సానుకూలభావం ఏర్పడటం జరుగుతుంది. ఇద్దరి మధ్య బంధం బలపడటం మొదలవుతుంది అంటున్నారు అధ్యయనకర్తలు. చిన్నమాటే... కానీ దాని ప్రభావం మాత్రం ఎక్కువ. కాబట్టి వీలయినప్పుడల్లా 'థాంక్స్' అని మనస్ఫూర్తిగా చెప్పండి. ఎదుటి మనిషికి, మనసుకి దగ్గరవ్వండి.