Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలు స్కూల్ నుంచి రాగానే అమ్మ మొదటగా చూసేది లంచ్బాక్సే. పెట్టింది పెట్టినట్టే ఉంటే.. లంచ్ ఎందుకు చేయలేదని తిట్ల దండకం ఎత్తుకుంటారు. ఇదే సీన్ తరచూ రిపీట్ అవుతుందంటే మీ పిల్లలకు ఎలాంటి ఆహారం కావాలో మీరు గుర్తించడంలేదని తెలుసుకోండి. వాళ్లు లంచ్ బాక్స్ పూర్తిగా ఖాళీ చేయాలంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి.
- ఉదయం పని హడావిడి ఎక్కువగానే ఉంటుంది. అలాగని స్కూల్‌కు వెళ్లే ముందు ఏం తింటారో.. మళ్లీ అదే లంచ్‌బాక్స్‌లో ప్రత్యక్షమైతే పిల్లలు ఉస్సూరుమంటారు. ఆకలిగా ఉన్నా తినలేక అలాగే వదిలేస్తారు. కాబట్టి పని ఒత్తిడి ఉన్నా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ రెండూ డిఫరెంట్‌గా ఉండేలా చూసుకోండి.
- మీ పిల్లలకు ఇష్టమైన వంటకాలు ఏవో మీకు తెలిసే ఉంటుంది. తరచూ వాటిని చేయండి. 'మా అమ్మ నాకిష్టమని స్పెషల్‌గా చేసింద'ని ఫ్రెండ్స్‌తో చెప్పి మరీ బాక్స్ అంతా ఖాళీ చేసేస్తారు.
రొటీన్ కర్రీలు, ఫుడ్ ఐటమ్స్ పిల్లలకు బోర్ కొట్టించేస్తాయి. అందుకే కాస్త డిఫరెంట్‌గా ట్రై చేయండి. పుదీనా రైస్, జీరా రైస్, కూరగాయ ముక్కలు ఎక్కువగా వేసి వెరైటీ ఐటమ్స్ చేయండి. స్ప్రింగ్ రోల్స్, బ్రెడ్‌తో చేసే ఫుడ్ ఐటమ్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పంపించండి. ఇవి పిల్లలకు రుచితో పాటు ఆరోగ్యాన్ని బోన్‌సగా ఇస్తాయి.
- అప్పుడప్పుడూ లంచ్‌బాక్స్‌తో పాటు చిరుతిండ్లు కూడా పంపించండి. ఇది పిల్లల్లో లంచ్ బాక్స్ ఎప్పుడెప్పుడు తెరుద్దామా అన్న ఉత్సుకతను పెంచుతుంది. మొలకెత్తిన గింజలు, పళ్ల ముక్కలు, డ్రై ఫ్రూట్స్ కొన్ని.. ఇలా రోజుకో వెరైటీ ఉండేలా చూసుకోండి.
- ముఖ్యంగా ఆకలిగా లేకుంటే ఎంత టేస్టీ ఫుడ్ అయినా పిల్లలు ముట్టుకోరు. ప్రతి రోజూ వారిని బాగా ఆడనీయండి. ఇండోర్ గేమ్స్‌కే పరిమితం చేయకండి. ఆరుబయట ఓ అరగంట పాటు సరదాగా ఆడితేనే పిల్లలు అలసిపోతారు. వారిలో జీవక్రియలు సాఫీగా సాగుతాయి. తద్వారా ఆకలి బాగా వేసి ఆహారం సరిగ్గా తీసుకుంటారు.