Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముందుగా తల, మెడ, నడుము నిటారుగా ఉంచి రెండు చేతులు నిటారుగా పెట్టి తాడాసనంలో ఉండాలి. ఆ తర్వాత కాళ్ళ మధ్యలో మీటర్ దూరం ఉండేలా నిలబడాలి. రెండు చేతులు నడుము వెనక ఇంటర్ లాక్ చేయాలి. ఇప్పుడు గుండెల నిండా గాలి పీలుస్తూ దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. నెమ్మదిగా శ్వాస వదులుతూ ముందుకు వంగుతూ తలను లేదు చుబుకంను నెలకు ఆనించే ప్రయత్నం చేయాలి. ఈ ఆసనంలో ఇరవై సెకన్ల పాటు ఉండి యథాస్థితికి రావాలి. ఇలా కనీసం పదిసార్లు చేయాలి.
ఉపయోగాలు..
వెన్ను బాగా సాగి బలం పుంజుకుంటుంది.
పొట్ట కండరాలు బలపడతాయి
తలలో రక్తప్రసరణ బాగా జరిగి టెన్షన్ తగ్గుతుంది.
మనసు ప్రశాంతంగా మారుతుంది.
ఒత్తిడి, నిరాశ దూరం అవుతాయి.
జాగ్రత్తలు..
నడుము, మెడకి సంబంధించిన సమస్యలు ఉన్నవారు డాక్టరు సలహాతో మంచి యోగా నిపుణుని పర్యవేక్షణలో సాధన చేయాలి.