Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మీ ఇంటి అందాన్ని పెంచడం కోసం, ఆకర్షణీయంగా కనబడేలా చేయడం కోసం ఖరీదైన వస్తువులను అలంకరణ కోసం వాడల్సినవసరం లేదు. మీరు ముందుగా మీ ఇంటికి ఎలాంటి అలంకరణ ఉంటే బాగుంటుందో ప్లాన్ చేసుకోండి. ఏయే వస్తువు ఎక్కడెక్కడ బాగుంటాయో ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోండి.
బాగా హడావిడి పడి చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాలలో సింపుల్‌గా చేసే ఇంటి డెకరేషనే చాలా అద్భుతంగా, ఆకర్షణీయంగా కనబడేలా చేస్తుంది. లైటనింగ్, ఫర్నీచర్, వాల్ డెక్కర్, ఫ్లోర్ డెకరింగ్, ఇంటీరియర్ డిజైన్స్ ఇలా ప్రతి ఒక్కదాని మీద దష్టి పెట్టి, తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ ఇల్లు మరింత అట్రాక్షన్‌గా తయారు చేసుకోవచ్చు. మరి అవేంటో చూద్దామా!
పెయింటింగ్స్: మీ ఇంటిని అలంకరించడంలో పెయింటింగ్స్ కన్నా మంచి అలంకరణలు మరొకటి లేదు. మీ ఇంటి కోసం తక్కువ ఖర్చులోనే ఎక్కువ ఆకర్షణీయంగా కనిపించేది తీసుకోవాలి. అదే విధంగా మీ ఇంటికి ఆ రంగు ఎలా ఉంటుందో ఆలోచించాలి.
కుషన్స్: మీ గదిని మరింత రిచ్‌గా, లక్సరీగా కనబడేలా చేయాలనుకుంటే మీ సోఫా లేదా బెడ్ మీదకు కొన్ని కుషన్స్ లేదా డెరేటివ్ పిల్లోస్‌ను ఎంపిక చేసుకోవడం మంచిది. ఇంటి అలంకరణలో తక్కువ బడ్జెట్ లో కుషన్లు లేదా పిల్లోలను ఎంపిక చేసుకోవడం అంత కష్టమైన పనేం కాదు. రకరకాల కొత్త కొత్త డిజైన్లలో దొరికే తక్కువ ఖరీదు వాటిని ఎంపిక చేసుకొని, మీ ఇంటి సోఫా లేదా బెడ్ మీద వాడుకోవడం వల్ల మీ ఇంటికి మరింత అందం వస్తుంది.
కర్టెన్లు, మ్యాట్స్: మీ ఇంట్లోని గదులకు మ్యాచ్ అయ్యే విధంగా కర్టెన్ల కలర్స్‌ను ఎంపిక చేసుకోవాలి. సింపుల్ కలర్లో ఉండే ఆకర్షణీయమైన కర్టెన్లను ఎంపిక చేసుకోవడం వల్ల మీ ఇంటికి అందం రెట్టింపవుతుంది. మీ ఇంటి అలంకరణలో తక్షణ మార్పును తీసుకురావడంలో కర్టెన్లు మరియు మ్యాట్స్ ఎంపిక చేసుకోవడం చాలా సులభ పద్దతి.
ఇండోర్ ప్లాంట్స్: అదే విధంగా కొన్ని అందమైన ఇండోర్ మొక్కలను మీ గదిలో ఉంచుకోండి. ఇండోర్ ప్లాంట్స్ ఇల్లు మరింత అందంగా కనబడేలా చేస్తాయి. ప