Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చీరను రెండు స్టెప్స్‌లో ధరిస్తారు. మొదటగా చీరను బేసిక్ టక్ చేయాలి. ఆ తర్వాత కొంగును తీయాలి. ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి. కొంగు ఎంత పొడవుగా ఉంటే మీరు అంత ఎత్తుగా కనిపిస్తారు. కొంగును భుజంపై సెట్ చేశాక దాన్ని నడుము వరకు తీసుకురావాలి. తర్వాత నడుము దగ్గరే కుచ్చులు తీసి టక్ చేయాలి. ఇలా మీరు పర్ఫెక్ట్ శారీ డ్రాపింగ్ చేయవచ్చు.
మీరు ఉదయం, సాయంత్రం చీరకట్టుకుని వెళ్లాలంటే రాత్రికే చీరకొంగును సెట్‌చేసి పినప్ చేయండి. దీన్ని హ్యాంగర్‌కు పెట్టి ఉంచండి. దీంతో చీర ధరించటంలో మీకు సగం సమయం ఆదా అవుతుంది.
సిల్క్ చీర కట్టుకునేటప్పుడు బ్రాడ్పట్లీ చేసుకోవాలి. దాన్ని మీరు న్యారో పట్లీ చేస్తే పొట్ట ముందుకు కనిపిస్తుంది. దీంతో మీ లుక్ పాడవుతుంది.
అధిక బరువు ఉన్న మహిళలకు నెట్ శారీ సూట్‌కాదు.
ప్రత్యేక సంప్రదాయాల సమయంలో గుజరాతీ స్టైల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ స్టైల్లో చీర కొంగు ముందువైపు ఉంటుంది. మీరు దాన్ని చక్కగా మెయింటైన్ చేయవచ్చు.
చీరతో పాటు ఒడ్డాణం ధరించటం చాలా పాతపద్ధతి. కానీ ఈరోజుల్లో చీరపై లెదర్ బెల్ట్, రాజస్థానీ ఒడ్డాణం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
అంతేకాకుండా చీర ధరించేముందు గుర్తుంచు కోవాల్సినవి...ఈరోజుల్లో యువ తులు చీరతో పాటు డిజైనర్ బ్లౌజులు ధరించేందుకు ఇష్టపడుతున్నారు. దీని ధర దాదాపు చీరకు సమానంగా ఉంటుంది. ఇలాంటి ఖరీదైన బ్లౌజులు ధరించేముందు అండర్ఆర్మ్స్ ప్యాడ్ పెట్టుకోవాలి. ఇవి చెమట నివారణకు సహాయపడతాయి. అంతేకాకుండా బ్లౌజ్‌ను అటుఇటు కదలకుండా చేస్తాయి. దీంతో మీరు సౌకర్యవంతంగా ఉండటంతో పాటు చెమటతో బ్లౌజ్ పాడవకుండా ఉంటుంది.