Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పైనాపిల్‌లో 'సి' విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది మధుమేహం, హృదయ సంబంధవ్యాధులు, క్యాన్సర్కారకాలైన ఫ్రీరాడికల్స్‌తో పోరాడుతుంది. పైనాపిల్ రసాన్ని తాగితే వాంతులు తగ్గుతాయి.
- పచ్చకామెర్లతో బాధపడుతున్నవారికి ఈ రసం ఎంతో మేలు చేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గించడంలో ఈ ఫలం సహాయపడుతుంది.
- నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది. పండిన అనాస పండును తింటుంటే పళ్ళ నుండి రక్తంకారే స్కర్వే వ్యాధి రాకుండా రక్షణ కలిగిస్తుంది.
- పూర్తిగా పండని అనాస రసం తీసుకుంటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి. జ్వరం, కామెర్ల వంటి అనారోగ్యాలు ఉన్న వారికి అనాస రసం ఇవ్వడం ఎంతో మంచిది.
- అనాసపండు రసాన్ని ముఖానికి రాసుకుని మర్దన చేస్తే చర్మం కోమలంగా, అందంగా మారుతుంది. పండులోని ఎంజైములు చర్మంలోని నిర్జీవ కణాలను తొలగిస్తాయి. అంతేకాకుండా నల్లటి మచ్చలు తొలగిపోతాయి
- తాజా అనాస పండు రసాన్ని గొంతులో పోసుకుని పుక్కిలిస్తే గొంతునొప్పి, టాన్సిల్స్ బాధనుంచి ఉపశమనం లభిస్తుంది. గజ్జి, దురద ఉన్నవారు అనాస రసం పైపూత మందుగా వాడితే మంచి గుణం కనిపిస్తుంది.