Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ కాలంలో తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలకు వెళ్లక తప్పని పరిస్థితి. దీంతో పిల్లలతో ఎక్కువ సమయం గడపలేని పరిస్థితి. దీనివల్ల పిల్లలకు, తల్లిదండ్రులకూ మధ్య దూరం పెరిగిపోతుంది. అందుకే అటు ఉద్యోగం చేసుకుంటూనే బంధం బలపరుచుకోవాలంటే..
- పిల్లలు తల్లిదండ్రులతో ఆడేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తారు. అందుకే మీరూ పిల్లల్లా మారిపోయి వాళ్లతో ఆడండి. అలాగే ఎటువంటి ఆలోచనలైనా సరే వారు చెప్పేది పూర్తిగా వినండి. అది సరైనవి కావని అనిపించినా వెంటనే చెప్పేయకండి. పూర్తిగా చెప్పాక ఏది ఎలా చేస్తే మంచిదో చెప్పే ప్రయత్నం చేయండి. ఇలా చేయడం వల్ల వాళ్లు బాధపడరు. సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి వాళ్ల సొంతమవుతుంది.
- పిల్లలతో ఎంత ఎక్కువ సమయం గడిపితే అంత గాఢమైన బంధం ఏర్పడుతుంది. మీ సాన్నిహిత్యం వారికి ఎంతో ఊరటనిస్తుంది. మీ పిల్లలకు సంబంధించిన రోజూవారీ కార్యక్రమాల్లో పాల్గొనే సమయం మీకు ఉండకపోవచ్చు. కానీ ముఖ్యమైన వాటికి మీరు తప్పక వెళ్లండి. ప్రాజెక్టుల తయారీ, పాఠశాలలో జరిగే ప్రత్యేక కార్యక్రమాల సమయాల్లో వారితో ఉండేలా చూసుకోండి.
- వారాంతాల్లో మీ మొత్తం సమయాన్ని పిల్లలకు కేటాయించండి. దీంతో ఉద్యోగ బాధ్యతలతో వాళ్లను పట్టించుకోవట్లేదన్న భావన వాళ్లలో కలగదు.