Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బోలెడంత ఆటవిడుపుతోబాటు చక్కని ఆరోగ్యాన్ని అందించే ఏకైక వాహనం సైకిల్. అన్ని తరగతుల వారు కొనగలిగిన వాహనమే గాక కాలుష్యపు సమస్యలూ ఉండవు. ఆరోగ్యంతో బాటు తగినంత ఫిట్నెస్ అందించే సైక్లింగ్ తాలూకు కొన్ని అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- కండరాల బలోపేతానికి సైక్లింగ్‌ను మించిన వ్యాయామం మరొకటి లేదు. భుజాలు, గుండె కండరాలకు సైక్లింగ్ చేసే మేలు అంతాఇంతా కాదు.
- తుంటి, మోకాళ్ళు, పిక్కల కదలికలను మెరుగు పరచటమే గాక వాటికి మేలైన ఆకారాన్నిచ్చే వ్యాయామమే సైక్లింగ్.
- రన్నింగ్, జాగింగ్ కంటే సైక్లింగ్ సులభమైన వ్యాయామం. వారానికి కనీసం రెండు, మూడు గంటలపాటు సైకిల్ తొక్కితే అవసరమైన కార్డియో వ్యాయాయం అందినట్లే.
- స్టామినా పెంచుకోవాలనుకునే వారు, బరువు తగ్గించుకోవాలనుకునే వారు రోజూ కాసేపు సైకిల్ తొక్కాలి. ఒక గంట పాటు సైకిల్ తొక్కటం వల్ల సుమారు 300 కేలరీలు ఖర్చవుతాయి. రోజూ అరగంట పాటు సైకిల్ తొక్కే వారు ఏడాదిలో 5 కేజీల బరువు తగ్గుతారు.
- ఆయా అవయవాల మధ్య చక్కని సమన్వయానికి సైక్లింగ్ ఎంతో దోహద పడుతుంది.
- సైక్లింగ్ ఏకాగ్రతను చేకూర్చటమే గాక నాడుల పని తీరును మెరుగు పరుస్తుంది.
- రోజూ సాయంత్రం కాసేపు సైకిల్ తోక్కేవారిలో మానసికమైన సమస్యలూ రావు.