Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒంటరిగా వెళ్ళుతున్న మహిళలను టార్గెట్ చేసుకుని అగంతకులు దాడి చేస్తుంటారు. ముఖ్యంగా ఆఫీస్‌లకు వెళ్ళేవారి హ్యాండ్ బ్యాగ్‌లు కొట్టేయడానికి, కొన్ని సార్లు వారి వద్ద ఉన్న ఆభరణాలు దోచుకోవడానికి సిద్ధపడతారు. ఇలాంటి సందర్భంలో ఎలా తప్పించుకోవచ్చో ఈ వారం చూద్దాం.
స్టెప్ 1: వెనక నుంచి మెడ దగ్గర కత్తి పెట్టినప్పుడు ఆ కత్తి ఆమె గొంతుకు తగలకుండా తన ఎడమచేతిని కత్తి లోపలి నుంచి పట్టుకోవాలి.
స్టెప్ 2: కుడిచేతితో ఆ వ్యక్తి చేతిని గట్టిగా పట్టుకుని ముందుకు లాగాలి. దాంతో అతను బ్యాలెన్స్ కోల్పోయి ముందుకు పడిపోతాడు
స్టెప్ 3: ఆ వ్యక్తి చేతులు వదులకుండా గట్టిగా మెలితిప్పి అతని గొంతుపై బలంగా కాలితో తొక్కాలి.