Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరివేపాకు లేని తాలింపు ఉండదంటే అతిశయోక్తి కాదు. ఉప్మాలోనూ, పులిహౌరలోనూ కరివేపాకు లేకపోతే రుచే రాదు. అయితే కరివేపాకు వల్ల వంటకాలకు రుచి, సువాసన మించి దానివల్ల ఉపయోగాలు లేవనుకుంటే అది పొరపాటు. కరివేపాకులో ఎన్నో విధాలైన ఔషధ విలువలున్నాయి. అవేంటో చూద్దాం..
- కరివేపాకును కొబ్బరినూనెలో మరిగించి, వడగట్టి ఆ నూనెను తలకు రాసుకుంటే వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయని తెలుసు.
- కరివేపాకు, వేప కలిపి ముద్దగా నూరి ఒక స్పూను ముద్దను అరకప్పు మజ్జిగలో కలిపి పరగడుపున తీసుకుంటే చర్మసమస్యలు తగ్గిపోతాయి.
- బ్లడ్‌షుగర్ ఉన్నవారు ప్రతిరోజూ కరివేపాకును విరివిగా వాడటం వల్ల ఆ వ్యాధి అదుపులోకి వస్తుంది.
- కరివేపాకును మెత్తగా నూరి నెయ్యి లేదా వెన్నతో కలిపి కాలిన గాయాలపై రాస్తుంటే మచ్చలు పడకుండా త్వరగానూ మానుతాయి.
- ఒళ్లంతా దురదలతో బాధపడేవారు కరివేపాకు, పసుపు సమానంగా తీసుకుని పొడిగొట్టుకుని రోజూ ఒక స్పూను మోతాదులో నెలరోజులపాటు తీసుకుంటే దురదలు తగ్గుతాయి.
- కరివేపాకు రసాన్ని పెరుగు లేదా వెన్నలో కలిపి కళ్లకింద రోజూ పూస్తుంటే కంటికింది వలయాలు మాయమవుతాయి.
- నీళ్లవిరేచనాలతో బాధపడేవారు గుప్పెడు కరివేపాకును ముద్దగా చేసి ఒకటి రెండు స్పూన్ల మోతాదులో అరకప్పు మజ్జిగలో కలిపి రోజుకు మూడు నాలుగు సార్లు సేవిస్తే వెంటనే తగ్గుతాయి.
- తేనెటీగ, తుమ్మెద వంటి కీటకాలు కుడితే కరివేపాకు రసాన్ని నిమ్మరసంతో కలిపి అవి కుట్టిన ప్రదేశంలో రాస్తే బాధ నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది.
- మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు ఒకస్పూన్ కరివేపాకు రసాన్ని రోజూ రెండుపూటలా తీసుకుంటుంటే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు.