Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ కాలంలో పెదాలు .. పగలడం, పొడిబారడం వంటి సమస్యలతో అందవిహీనంగా కనిపిస్తుంటాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే...
- రోజూ రాత్రి పడుకునే ముందు పెదాలకు తేనె రాసి మెత్తని బ్రష్‌తో మదువుగా రుద్దాలి. ఇలాచేయడం వల్ల ఉదయానికి పొడిబారే సమస్య తగ్గుతుంది. పెదాలు తగిన తేమతో కాంతివంతంగా కనిపిస్తాయి.
- గుప్పెడు గులాబీరేకల్ని ముద్దగా చేసుకొని దానికి చెంచా వెన్న కలపాలి. ఆ మిశ్రమానికి రెండు చుక్కల బాదం నూనె చేర్చి పెదాలకు రాసుకుంటే మదువుగా కనిపిస్తాయి. పొడిబారడం తగ్గి పెదాలు పగిలే సమస్య దూరమవుతుంది.
- కొందరి పెదాలు నల్లగా ఉంటాయి. ఇలాంటివారు తేనె, పంచదార ఆలివ్‌నూనెల మిశ్రమాన్ని పెదాలకు రాసి మదువుగా రుద్దితే మతకణాలు తొలగిపోతాయి. నలుపుదనం తగ్గుతుంది. అందంగానూ కనిపిస్తాయి.
- బీట్రూట్ రసాన్ని ఉదయాన్నే పెదాలకు రాసుకుంటే మీరు కోరుకున్న నునుపుదనం వస్తుంది. అవి లేత గులాబీ రంగులోకి మారతాయి.
- కొత్తిమీర, క్యారెట్లను రసంగా తీసుకుని సమాన పరిమాణంలో కలుపుకోవాలి. రోజూ రాత్రిపూట ఈ మిశ్రమాన్ని రాసుకుంటే పెదాలు మదువుగా మారతాయి