Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అర్థరాత్రి వరకు ఫోన్లు వాడే అలవాటు, టీవీ చూసే అలవాటు ఉన్నవారికి పొద్దున్నే కష్టమే. అయితే ఆరోగ్యాన్ని హరించే అలవాట్ల నుంచి బయట పడాలన్నా, శారీరక, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలన్న పొద్దున్నే నిద్ర లేవాలి అంటున్నారు పరిశోధకులు. మరి పొద్దున్నే లేవడం వల్ల కలిగే లాభాలు ఎంటో చదవండి..!
- తెల్లవారు జామున లేవడం వల్ల సానుకూల ఆలోచనలు వస్తాయి. రోజంతా ప్రశాంతంగా ఉంటారు.
- పొద్దున్నే వ్యాయామం చేయడం వల్ల శరీరంలోకి ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. ఇవి ఉల్లాసంగా ఉంచుతాయి.
- సూర్యోదయం వేళ నడక ఎంతో మంచిది. దీని వల్ల రక్త ప్రసరణ మెరుగుపడటంతో పాటు మెదడుకు ఆక్సిజన్ సరఫరా బాగా జరుగుతుంది.
- అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారికి జీర్ణక్రియ సంబంధిత, గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ వ్యాధుల బారిన పడకుండా ఉంటాలంటే పొద్దున్నే నిద్రలేవాలి.
- పొద్దున్నే సూర్యరశ్మిలో అరగంట సేపు గడిపినా చాలు విటమిన్ డి లోపంతో వచ్చే చాలా సమస్యలు దరి చేరవు.